Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెండితెరపైకి 'డొక్కా సీతమ్మ' జీవిత కథ.. 'ఆంధ్రుల అన్నపూర్ణ' గా ఎలా మారారు?

అన్ని దానాల్లో ఏ దానం గొప్పది అంటే.. అన్నదానం గొప్పది అని అంటారు పెద్దలు. ఎందుకంటే, ఆకలికి కులమత పట్టింపులు, పేద, ధనిక అని తేడాలు లేవు. ఆకలి బాధ అందరికీ సమానమే. అలాంటి ఎంతోమంది ఆకలిని తీర్చి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు శ్రీమతి డొక్కా సీతమ్మ.

అయితే తాజాగా ఆమె జీవిత కథను వెండితెరపైకి ఆవిష్కరించనున్నారు. ప్రముఖ సీనియర్ నటి ఆమని డొక్కా సీతమ్మ పాత్ర పోషించనున్నారు. డొక్కా సీతమ్మ బయోపిక్ ను టీవీ రవినారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి వచ్చిన ప్రతి రూపాయిని డొక్కా సీతమ్మ పేరుపై ఉన్న పథకానికి వినియోగించమని ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని చిత్ర దర్శకుడు తెలిపారు. మరి డొక్కా సీతమ్మ జీవిత విశేషాలేంటి..? బ్రిటిష్ దొరే చేతులెత్తి మొక్కేంత నిత్యాన్నదాతగా ఎలా ప్రసిద్ధి చెందారు..?

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపింది భవానీశంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రి శంకరంను గ్రామస్థులు 'బువ్వన్న' అనే పేరుతో పిలిచేవాళ్లు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ'(అన్నం) పెట్టేవారు. అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ.. తండ్రి బాటలోనే నడిచి అన్నార్తుల ఆకలిని తీర్చారు.

Andhra s Annapurna The Story of Dokka Seethamma

బాల్యంలో సీతమ్మకు ఆమె తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పించారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువ. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణించారు. దీంతో ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు.

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అలాంటి ఓ లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు అనే పెద్ద ధనవంతుడు ఉండేవారు. ఆయన ధనవంతుడే మంచి వేదపండితుడు. ఒక రోజు పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. భోజనం చేసే సమయం కావడంతో మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం ఇంటికి వెళ్లి ఆ పూట వారి ఇంట్లోనే ఆతిధ్యాన్ని స్వీకరించారు. అక్కడే యవ్వనంలో ఉన్న సీతమ్మ చూపించిన గౌరవ మర్యాదాలు, వినయ విధేయతలు నచ్చి జోగన్నకు ఆమెను వివాహం చేసుకున్నారు.

Andhra s Annapurna The Story of Dokka Seethamma

జోగన్న గ్రామమైన లంకగన్నవరం దారిలో ఉండటం వల్ల చాలామంది ప్రయాణికులు వారి ఇంటి వద్దే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్నం లేదని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. అలా అతికొద్ది కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో 'నిత్యాన్నపూర్ణ'గా సీతమ్మ పేరుపొందారు.

వరదల వల్ల లంక గ్రామాలకు తరచూ ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసేవారు సీతమ్మ. డొక్కా సీతమ్మ తన సొంత వనరులతో, నిధులతో నిత్యాన్నదానాన్ని చేసి అన్నార్తుల బాధలను తొలగించారు. అలా ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లాండ్ వరకూ వ్యాపింపజేశారు.

బ్రిటిష్ రాజు నుంచి పిలుపు..

డొక్కా సీతమ్మ గొప్పతన గురించి తెలుసుకున్న బ్రిటీష్‌ 7వ ఎడ్వర్డ్‌ చక్రవర్తి పట్టాభిషేకం వార్షికోత్సవానికి రావాలని 1903లో ఆమెకు ఆహ్వానం పంపారట. సీతమ్మ తాను రాలేను.. క్షమించని కోరినట్లు సమాచారం. ఐతే కనీసం ఆవిడ ఫోటోని పక్కన పెట్టుకుని పట్టాభిషేకం చేయించుకుందామనుకున్న చక్రవర్తి అప్పట్టో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాసారట.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆమె ఫోటో కోసం వెళితే తిరస్కరించారట. బ్రిటీష్ ప్రభువుల ఆదేశాలని, ఫోటో తీయించుకోకపోతే తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారట. తర్వాత ఆ బ్రిటిష్ చక్రవర్తి ఓ సోఫాలో సీతమ్మ ఫోటో పెట్టి నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నారట. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉందని చెబుతుంటారు. అందుకే ఆమె పేరుతో ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు.

Take a Poll

అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పడమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.. కేవలం అన్నదానమే కాకుండా మరెన్నో శుభాకార్యాలకు విరాళాలు ఇచ్చారు. ఈమె 1909లో మరణించారు.

మరుగున పడుతున్న ఇలాంటి ఆణిముత్యాల చరిత్రను సినిమాగా తీసుకురావడం, లేదా పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా భవిష్యత్తులో యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తాజాగా డొక్కా సీతమ్మగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. సీతమ్మలాగే తెల్లచీర, గుండుతో కుర్చీలో కూర్చుని కనిపించారు ఆమని. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఆమె నారి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బయోపిక్‌లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో డొక్కా సీతమ్మ ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+