ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు

తిరుమల శ్రీవారి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాల గడువు సమీపించింది. రేపటి నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కిందటి నెల సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినందున అదే స్ఫూర్తితో ఈ నవరాత్రి ఉత్సవాలను కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ బ్రహ్మోత్సవాలకు ఈ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అర్చకులు. సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి సమస్త భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.

Ankurarpanam festival of prelude for Navahnika Navaratri Brahmotsavams will be performed on today

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం. అనంతరం మేదిని పూజ చేపడతారు. నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

చెన్నైలో సీఎం విజయ్ తో రాహుల్ గాంధీ ఫార్మల్ మీటింగ్.. !!
చెన్నైలో సీఎం విజయ్ తో రాహుల్ గాంధీ ఫార్మల్ మీటింగ్.. !!

వైఖానస ఆగమ క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టికుండల్లో పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు- సూర్యుడు, బియ్యం- చంద్రుడు, కందులు- కుజుడు, పెసలు- బుధుడు, శనగలు- బృహస్పతి, అలసందలు- శుక్రుడు, నువ్వులు- శని, మినుములు- రాహువు, ఉలవలు- కేతువుకు సంకేతంగా భావిస్తారు.

అభిజిత్ దిప్కే కుటుంబంలో తీవ్ర విషాదం- ఇంటికి పంపిస్తామన్న పోలీసులు
అభిజిత్ దిప్కే కుటుంబంలో తీవ్ర విషాదం- ఇంటికి పంపిస్తామన్న పోలీసులు

అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.

దసరా సెలవుల కారణంగా భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, భద్రతతో పాటు రవాణా, పారిశుధ్యం తదితర విభాగాల సమన్వయంపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తోన్నారు. తిరుపతిని కూడా విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దే పనులు వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+