Annadata Sukhibhava PM Kisan : నేడే రైతుల ఖాతాల్లో 6 వేల జమ...!
ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు 'అన్నదాత సుఖీభవ' (annadata sukhibhava) నిధుల్ని ఇవాళ జమ చేయనుంది. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0 (annadata sukhibhava-pm kisan scheme)'లో భాగంగా రైతులకు ఇవాళ ఈ సాయం విడుదల కానుంది. ఈ పథకం మూడవ విడతగా మొత్తం 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6వేలు జమ అవుతాయి. మూడో విడత కోసం రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం రూ.14 వేలను ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఇవాళ ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తి కానుంది.
అన్నదాత సుఖీభవ 3.0 నిధుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో విడుదల చేస్తారు. సూరంపల్లిలో జరిగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 05.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అనంతరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి సూపర్ -6లో పేర్కొంది. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు జమ చేస్తున్నారు. ఈ మేరకు 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేలు, రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు ఇచ్చారు. ఇవాళ మూడో విడతలో రూ.6 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.2,676 కోట్లు ఇస్తున్నారు. దీంతో రైతులకు ఇచ్చిన హామీ ఈ ఏడాదికి పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications