ఎన్నికల వేళ విశాఖలో బిగ్ టర్న్ - ఏ పార్టీపై ఎఫెక్ట్..!!

ఏపీలో ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా కొత్త వివాదం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతుందునే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా గంగవరం పోర్టులో ఆపరేషన్లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. వీరితో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. రెండు కోక్‌ ఓవెన్లలో జీరో ఉత్పత్తికి చేరాయి.

కొత్త పరిణామాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఆ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఆపరేషన్లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. వీరితో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. కోకింగ్‌ కోల్‌ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు ద్వారానే స్టీల్‌ప్లాంటు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల బొగ్గుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండు నౌకలు అదానీ గంగవరం పోర్టులో ఐదు రోజులుగా నిలిచిపోయాయి. బొగ్గు సరఫరా లేకపోవడంతో స్టీల్‌ప్లాంటులోని ఐదు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల్లో రెండింటిలో ఉత్పత్తిని జీరో చేశారు.

Anothe controvesy begin in Vizag steel plant ahead Elections in the state Zero production in two vovens

నిలుస్తున్న ఉత్పత్తి
మూడు బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో ఇప్పటికే ఒకటి మూసేయగా, తాజాగా మరొకటి మూసేస్తున్నారు. ఇక మిగిలింది ఒక్కటే. రోజుకు 20 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 14 వేల నుంచి 15 వేల టన్నుల ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. ఇకపై ఒక బ్లాస్ట్‌ ఫర్నే్‌సపై ఐదు నుంచి ఆరు వేల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి రాదు. కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలను షట్‌డౌన్‌ చేయడం వల్ల భారీ నష్టం జరగనుంది. వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.వందల కోట్ల వ్యయం అవుతుంది. తక్షణమే బొగ్గు సరఫరా పునరుద్ధరించకపోతే మిగిలిన మూడు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలను ఒక్కొక్కటిగా షట్‌ డౌన్‌ చేయాల్సి ఉంటుంది. స్టీల్‌ప్లాంటుకు ముడి సరకులన్నీ కన్వేయర్‌ బెల్డ్‌ ద్వారా అందించడానికి అదానీ గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దానిని పాటించడం లేదు.

ఏం జరుగుతోంది
విశాఖ స్టీల్‌ప్లాంటులో శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు 30 వేల మంది పనిచేస్తున్నారు. మరో 50 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. వేయి మంది కూడా లేని పోర్టు కార్మికుల ప్రయోజనాల కోసం లక్ష మంది ఆధారపడిన స్టీల్‌ప్లాంటుకు నష్టం జరుగుతుంటే ఎవరూ స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇలా ఆకస్మిక సమ్మె చేయడంపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. స్టీల్‌ప్లాంటు యాజమాన్యం మంగళవారం ఉదయం కార్మిక సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బొగ్గు కొరత వల్ల ఉత్పన్నమైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనాలనే దానిపై సలహాలు ఇవ్వాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+