బాబుకు 100 ప్రశ్నలు: బొత్స, 'జగన్‌కు మరో 15మంది ఎమ్మెల్యేలు షాక్'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: తాము వంద ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ పేపర్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్తామని, తాము ప్రభుత్వాన్ని విమర్శించడం కాదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాత్రమే అడుగుతామని వైసిపి నేత బొత్స సత్యనారాయణ గురువారం నాడు అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీల పైన టిడిపి సానుభూతిపరులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే హక్కు టిడిపికి లేదన్నారు. రేపటి నుంచి గడపగడపకు వైయస్సార్ ప్రారంభమవుతుందని, ఆరు నెలలు ఉంటుందని చెప్పారు.

ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్తామని చెప్పారు. రేపు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని గడపగడపకు వైసిపి కార్యక్రమం చేపడతామన్నారు.

 Another 15 MLAs may join TDP from YSRCP

మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి: జలీల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన గెలిచి, కొద్ది నెలల క్రితం వైసిపిలో చేరిన జలీల్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి నుంచి టిడిపిలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే సదరు 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారన్నారు.

వైసీపీ అధినేత జగన్ ఏనాడూ ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. మైనారిటీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈద్ ఉల్ పితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Another 15 MLAs may join TDP from YSR Congress party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X