AP Govt: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు యత్నాలు? తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ టీవీ డిబేట్ లో రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు పెడతామని జనసేన చేసిన హెచ్చరికల తర్వాత ఆయన క్షమాపణ చెప్పేశారు. అయినా నాగేశ్వర్ పై ఏపీలో కేసులు పెట్టడంపై ఇప్పటికే రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇవాళ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారన్న వార్తలు కలకలం రేపాయి.

ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్..! చంద్రబాబు కీలక ప్రకటన..!
ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్..! చంద్రబాబు కీలక ప్రకటన..!

ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్ కు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నాగేశ్వర్ ఇంటి వద్ద భద్రత కల్పించారు. దీంతో ఏపీ పోలీసుల్ని నిజంగానే ప్రభుత్వం (Ap govt) అరెస్టుకు పంపిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వీటిపై ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని ఇందులో తేల్చేసింది.

AP Govt Denies Sending Police to Hyderabad for Prof Nageswar s Arrest

అలాంటిదేం జరగలేదని, కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫ్యాక్ట్ చెక్ లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వివరణ తర్వాత అయినా ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందా లేక నిజంగానే నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తే తెలంగాణ పోలీసులు ఏం చేయబోతున్నారు ? ఇరు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ ను మరోసారి రగిల్చేందుకు ఈ వ్యవహారం కారణమవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+