విజయ్ టీంలో కొడుకు మంత్రి - తల్లి వంటమనిషి, తండ్రి పూజారి:నెటిజన్ల ప్రశంసలు...!!
తమిళనాడు కేబినెట్ కూర్పు లో విజయ్ మార్క్ ఎంపిక స్పష్టంగా కనిపించింది. సామాన్యులకు మంత్రులుగా అవకాశం కల్పించారు. తన పార్టీ నుంచి ఎంతో మంది విద్యావంతులు... యువతకు సీట్లు కేటాయించారు. మంత్రివర్గంలోనూ అదే ఫార్ములా అమలు చేసారు. ఒకప్పుడు విజయ్ కు వీరాభిమానిగా.. తరువాత విధేయుడిగా మారిన యువకుడికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేసారు. ఆ మంత్రి తల్లి ఇప్పటికీ వంటలు చేస్తూ... తండ్రి పూజారీ గా ఉండటం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
విజయ్ కేబినెట్ లో ఎస్ రమేస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి వరకు సాదాసీదా కుటుంబంగా ఉన్న రమేశ్ ఫ్యామిలీ ఒక్క సారిగా వార్తల్లోకి వచ్చింది. వారు ఉండే ప్రాంతంలో చిన్న కుటుంబంగా పరిచయం ఉన్న వారి ఫ్యామిలీ అందరినీ ఆకట్టుకుంది. అయితే, తమ కళ్ల ముందు తిరిగే రమేశ్ మంత్రి అయ్యారు. ఆ తరువాత వారి కుటుంబ సభ్యుల జీవనోపాధి విషయం లో మార్పు రాలేదు ఇప్పటికీ రమేశ్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ తమ పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. మంత్రి రమేష్ తండ్రి శ్రీనివాసన్ మరైమలై నగర్‌లోని ప్రముఖ శివ విష్ణు ఆలయంలో అర్చకుడిగా యథావిధిగా కొనసాగుతున్నారు. తల్లి సుమతి వంట పని చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ మరైమలై నగర్ నుంచి మైలాపూర్‌కు లోకల్ ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ తన కుమారుడు మంత్రి కాకముందు ఎలా ఉండోవారో అదే విధంగా ఇప్పటికీ ఇళ్లల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు.

రమేష్ తల్లి తండ్రుల నిరాడంబరత పై ప్రశంసలు
విజయ్ కేబినెట్ లో మంత్రి అయిన రమేశ్ కుటుంబానికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఒక ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన స్థలంలో నిర్మించిన చిన్న ఇంట్లో మంత్రి కుటుంబం నివసిస్తోంది. అయితే ఇళ్లు గుడి స్థలంలో ఉండటం వల్ల వారు ఎలాంటి అద్దె చెల్లించే అవరసం లేకపోవటం తో అందులోనే ఉంటున్నారు. రమేశ్ మంత్రి అయినా.. ఆ ఇంటిని వదలటానికి ఇష్టపడటం లేదు. తమ కుమారుడు మంత్రి అయినా.. తమ పని తాము చేసుకోవడమే తమకు తెలుసని తండ్రి శ్రీనివాసన్ చెబుతున్నారు. ఒక సామాన్యుడు మంత్రి అయినా.. వారి కుటుంబాల్లో దర్పం రావటం ఈ మధ్య కాలంలో సాధారణంగా మారింది. అయితే, ఇప్పుడు రమేష్ కుటుంబంలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. కుమారుడు మంత్రి అయినా, ఆయన తల్లిదండ్రులు నిరాడం బరంగా జీవించడం నిజంగా గర్వించదగ్గ విషయమని నెటిజన్లు అభినందిస్తున్నారు.













Click it and Unblock the Notifications