కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూల్లో గుడ్ న్యూస్ - మరో 24 మంది కరోనా విజేతల డిశ్చార్జ్

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ను జయించిన 24 మంది విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. వీరిని కలెక్టర్ వీరపాండియన్ దగ్గరుండి ఇళ్లకు పంపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అత్యధిక కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో ఇప్పటివరకూ వీరితో కలుపుకుని 31 మంది డిశ్చార్జ్ అయినట్లయింది. ఇవాళ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు, నంద్యాల నుంచి ఏడేసి మంది, పాణ్యం, సిరివెళ్ల, నందికొట్కూరుకు చెందిన ఇద్దరేసి, గడివేముల, రుద్రవరం, ఆత్మకూరు, డోన్ కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

another 24 recovered discharges from kurnool state covid 19 hospital

కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించారు. దీంతో పాటు డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందించారు, తర్వాత ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు.
ఈ నెల 6న జిల్లా కోవిడ్ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్ వార్డులలో ఆ 24 మందికి నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు వివరించారు.

English summary
another 24 patients recovered from coronavirus have been discharged fromkurnool state covid 19 hospital today. with this a total of 31 patients recovered discharged so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X