మొన్న పీడీ .. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ : విజయవాడలో మరో కీచక తండ్రి ; ఏడాదిన్నరగా కన్నబిడ్డపై అత్యాచారం
వాళ్ళు అనామకులు కాదు. చదువు సంధ్య లేని వాళ్ళు అంతకంటే కాదు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని ఉత్తముల్లా చలామణి అవుతున్న వ్యక్తులు. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డలను చెరుస్తున్న మానవ మృగాలుగా సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తున్నారు. వీళ్లు తండ్రులేనా అన్న భావనను అందరికీ కలిగిస్తున్నారు.

మొన్న ఐదేళ్ళ కూతురిపై తండ్రి అత్యాచారం .. ఇప్పుడు మరో ఘటన కన్నబిడ్డపై తండ్రి ఘాతుకం
విజయవాడలో మొన్నటికి మొన్న ఓ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి భార్య ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ల కూతురు పై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరచిపోకముందే తాజాగా మరో కీచక తండ్రి ఉదంతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న 35 సంవత్సరాల వ్యక్తి వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్. అతడికి 13 సంవత్సరాల కుమార్తె 11 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. గత ఏడాది మార్చి నెల నుండి కన్నతండ్రి స్థానంలో ఉన్న మానవ మృగం కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

భార్య నిద్రపోయాక తండ్రి అసభ్య ప్రవర్తన .. తల్లి లేని సమయంలో అత్యాచారం
భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక భార్య ఇంట్లో లేని సమయం చూసి తండ్రి కుమార్తె పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లికి చెప్పలేక, తండ్రి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న చిన్నారి మౌనంగా రోదిస్తుంది. ఇక ఇటీవల కూడా తండ్రి తన ప్రవర్తన మార్చుకోకపోవటంతో తీవ్ర వేదనకు గురైంది బాలిక , ఈ నెల 8,10 వ తేదీల్లో అత్యాచారం చెయ్యటంతో భరించలేకపోయిన బాలిక నానమ్మ ఇంటికి వెళ్ళింది. తాను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నానని తల్లికి చెప్పి నానమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక అక్కడ నానమ్మకు జరిగిన విషయం చెప్పి రోదించింది.

ఏడాదిన్నరగా తండ్రి లైంగిక వేధింపులు .. నానమ్మతో కలిసి పోలీసులకు బాలిక ఫిర్యాదు
తండ్రి ఏడాదిన్నరగా తనపై చేస్తున్న రాక్షస కృత్యాన్ని బాలిక నానమ్మకు చెప్పగా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదలాయించారు . పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న వ్యక్తి కన్నబిడ్డ పైనే అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మొన్న పీడీ .. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ .. మానవ మృగాల్లా తండ్రులు
మొన్నటికి మొన్న విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ తో పాటు వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి ఐదు సంవత్సరాల తన కన్న బిడ్డ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరిచిపోకముందే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రులేకామ పిశాచాల మాదిరిగా కన్న బిడ్డల జీవితాన్నే నాశనం చేస్తున్నారు . అభం శుభం తెలియనిచిన్నారులపైఅత్యాచారానికి ఒడిగడుతున్నారు. మానవ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి తండ్రి అన్న పదానికే కళంకం తెస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న ఘటనలు .. ఆలోచనా ధోరణిలో మార్పు అవసరం అంటున్న నిపుణులు
సమాజంలో చదువుకున్నవారు కూడా ఈ తరహా దారుణాలకు, అఘాయిత్యాలకు పాల్పడడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా అత్యాచారాలను నిరోధించటానికి ప్రయత్నాలు చేస్తున్నా నిత్యం దేశంలో ఇలాంటి దారుణం ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాలు, శిక్షలు మాత్రమే కాకుండా మానవుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. లేదంటే ఎలాంటి విచక్షణ లేకుండా జరుగుతున్న ఇటువంటి దాడులు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications