పరువు తీయొద్దు: వైసిపి నుంచి వచ్చి టిడిపికి చుక్కలు చూపిస్తున్న బాబ్జీ
విశాఖ: తెలుగుదేశం పార్టీ నేత గండి బాబ్జీ పైన సొంత పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాజాగా, గండి బాబ్జీ పైన మరో కేసు నమోదయింది.
ఆర్మీ ఉద్యోగి సతీష్ కుటుంబానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో సబ్బవరం పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు నమోదు అయింది. గండి బాబ్జీ తన సోదరుడు, అనుచరులతో కలిసి వచ్చి పంటను ధ్వంసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

అడ్డుకునేందుకు వచ్చిన తమను కొట్టారని చెప్పారు. దీంతో పలు సెక్షన్ల కింద గండి బాబ్జీ, ఆయన సోదరుడు, అనుచరుల పైన కేసు నమోదు చేశారు. గండి బాబ్జీ తీరు పైన టిడిపిలోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బాబ్జీ ప్రవర్తన మార్చుకోవాలని, ఆయన వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని చెబుతున్నారని అంటున్నారు. గండి బాబ్జీ ఇటీవలే వైసిపి నుంచి టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications