ఎపి పునర్విభజన చట్టంపై...సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై సుప్రీంకోర్టులో ఆంధ్రా జేఏసీ చైర్మన్, న్యాయవాది సుంకర కృష్ణమూర్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 

స్పందించిన సుప్రీం కోర్టు ఎందుకు విభజన చట్టంపై ఇన్ని పిటిషన్లు వస్తున్నాయని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.పునర్విభజన చట్టంపైగతంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై ధర్మాసనం ప్రశ్నించగా ఆ పిటిషన్ కు...తమ పిటిషన్‌కు వ్యత్యాసం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ సుప్రీం కోర్టుకు తెలిపినట్లు తెలిసింది.తాము ఆంధ్రా సమస్యలపై పిటిషన్ దాఖలు చేశామని చెప్పిన పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనంకు వెల్లడించినట్లు సమాచారం.

Another petition filed on AP reorganization act in Supreme Court

అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు మీరు కూడాఆ కేసులోనే ఇంప్లీడ్ కావాలని తాజా పిటిషనర్ లకు సూచించినట్లు తెలుస్తోంది. మీ వైపు నుంచి ఏమి చెప్పాలనుకున్నా ఆ కేసులో ఇంప్లీడై చెప్పుకోవచ్చని ధర్మాసనం పిటిషనర్ తరుపు న్యాయవాదికి స్పష్టం చేసినట్లు సమాచారం.

ప్రధాన మంత్రి రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ సహా 6 హామీలు, విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో అమరావతి నిర్మాణం చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ సమగ్రంగా అధ్యయనం చేసి సత్వరం పూర్తిచేయాలని పిటిషనర్లు తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారని తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravati: Andhra JAC Chairman and Advocate Sunkara Krishnamurthy filed a petition in the Supreme Court on Andhra Pradesh reorganization act.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X