కీలక మలుపు తిరిగిన అమరావతి రాజధాని!!

స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ద్వారా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. తేదీ ఇంకా ఖరారు కాలేదు. కాగా ఏపీ రాజధానిని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఆదేశాలివ్వగా.. ఆ ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనికోసం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 23వ తేదీన విచారణ జరపబోతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

ఏపీలో మూడు రాజధానులు అమరావతి, విశాఖపట్నం, కర్నూలుకు సంబంధించిన అంశం 23వ తేదీన స్పష్టత రానుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్న న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులతోపాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీచేసింది.ఈ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అడ్వకేట్ జనరల్ సుప్రీం కోర్టును కోరారు. ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వస్తే విశాఖకకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది.

another petition in supreme court on ap capital amaravati issue

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ 29 గ్రామాల్లో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం వీరు పోరాడుతున్న ఈ క్రమంలోనే డిసెంబరు 31న ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కాబోతోందని, తాను కూడా త్వరలోనే అక్కడకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా విశాఖలోనే ఏర్పాటవుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ ఖండించాయి. రాజధానిగా అమరావతే ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా అదేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+