పిఠాపురంలో వైసీపీకి మరో షాక్ ? జనసేన వైపు మాజీ ఎమ్మెల్యే చూపు..!

ఏపీలో గత ఎన్నికల పరాజయం మర్చిపోకముందే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి వంగా గీతను దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి.. ఇప్పుడు ఆ నిర్ణయంతో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కీలక నిర్ణయం వెలువడనుంది.

గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును కాదని జగన్ .. పవన్ కళ్యాణ్ పై పోటీకి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెచ్చి నిలబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ హవాలో వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్ధితి. కానీ సిట్టింగ్ అయిన తనను కాదని కాకినాడ ఎంపీ అయిన వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయించడంతో ఎన్నికల్లోనూ ఆమెకు దొరబాబు సహకరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.

another setback to ysrcp in pithapuram as former mla dorababu talks to join janasena

పిఠాపురంలో పవన్ విజయం తర్వాత వైసీపీ నేతలైన వంగా గీతతో పాటు పెండెం దొరబాబు కూడా కనిపించడం లేదు. మారిన పరిస్ధితుల్లో జనసేనలో చేరితే భవిష్యత్తులో పక్కన నియోజకవర్గాల్లో అయినా సీటు దక్కుతుందనే భావనలో ఉన్న దొరబాబు.. ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఆయనకు జనసేనలో చేరే అవకాశం దక్కుతుంది. ఇది తేలితే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+