అచ్చెన్నాయుడుకు తిరగబెట్టిన గాయం - మరో ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు....
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ తర్వాత రిమాండ్ విధించాక అనారోగ్యం రీత్యా గుంటూరు ప్రభుత్నాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరో సర్జరీ అవసరమని తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఆయన్ను పరీక్షిస్తున్న వైద్యులు.. అచ్చెన్నాయుడికి రక్తస్రావం ఆగడం లేదని తాజాగా వెల్లడించారు. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గతంలో పైల్స్ ఆపరేషన్ చేశారు. అప్పట్లో గాయం మళ్లీ తిరగబెట్టింది. ఇన్ఫెక్షన్ కారణంగా బ్లీడింగ్ కంట్రోల్ కావడం లేదని సమాచారం. దీంతో అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్ నిర్వహించేందుకు వీలుగా ఉన్నతాధికారులను వారు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి లభిస్తే ఇవాళ సాయంత్రమే ఆపరేషన్ చేసే అవకాశముంది.













Click it and Unblock the Notifications