రఘురామకు మరో టెన్షన్-మోడీ టూర్ లో ప్రోటోకాల్-జగన్ ను కాదని కేంద్రం సహకరిస్తుందా?
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ నెల 4న భీమవరం వస్తున్నారు. అయితే ఈ టూర్ లో భాగంగా బహిరంగసభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభకు రావాలని అన్ని పార్టీలకూ కేంద్రం ఆహ్వానాలు పంపుతోంది. అయితే స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం అందిందా లేదా అన్న దానిపై ఓవైపు ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టు అనుమతితో ఈ సభకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆయనకు కొత్త సమస్యలు తప్పడం లేదు.

మోడీ టూర్ లో రఘురామ
ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇందుకోసం కేంద్రాన్ని గతంలోనే భద్రత కోరారు. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ తర్వాత ఏపీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నిన్న హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన హైకోర్టు.. రఘురామను అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం కుదరదంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో భీమవరం టూర్ కు వెళ్లేందుకు సిద్దమవుతున్న రఘురామకు మరో చిక్కు వచ్చి పడింది.

శిలాఫలకంపై రఘురామ పేరు
మోడీ టూర్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వద్ద పెట్టే శిలాఫలకం విషయంలో ఇప్పుడు వివాదం తలెత్తింది. ఈ శిలాఫలకంపై ఎవరెవరి పేర్లు ఉండాలనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. శిలాఫలకంపై పెట్టే పేర్లలో ప్రధాని మోడీ, సీఎం జగన్ తో పాటు స్ధానిక ఎంపీగా రఘురామరాజు పేరు పెట్టాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రఘురామపేరు పెట్టే విషయంలో పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ పేరు శిలాఫలకంపై ఉంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మళ్లీ కేంద్రాన్ని ఆశ్రయించిన రఘురామ
మోడీ భీమవరం టూర్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న శిలాఫలకంపై తన పేరు ఉండాలంటూ పట్టుబడుతున్న స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు .. ఈ విషయంలో జగన్ సర్కార్ నుంచి ఎదురవుతున్న ఆటంకాలపై కేంద్రాన్ని ఆశ్రయించారు. కేంద్ర సాంస్కృతిక శాఖకు ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.
ఇందులో భీమవరంలో శిలాఫలకంపై తన పేరు లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, స్ధానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం తన పేరు ఉండేలా చూడాలని కోరారు. దీంతో సాంస్కృతిక శాఖ ఈ వ్యవహారంపై దృష్టిసారించింది.












Click it and Unblock the Notifications