టీడీపీ-జనసేన పొత్తుపై మరో ట్విస్ట్ ? ఆ ఒక్కటే మినహాయింపు ! అసలు వ్యూహమిదే ?

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య కుదురుతుందని భావిస్తున్న పొత్తులో అప్పుడే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజా వలసలు ఇందుకు వేదికగా మారుతున్నాయి.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన మధ్య ఈసారి ఎన్నికల్లో పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆలోపే ఇరు పార్టీలకు చెందిన నేతలు పార్టీలు ఫిరాయించడమో, ఆ వ్యూహాలు రచిస్తుండటమో చేస్తున్నారు. దీంతో ఈ ఫిరాయింపుల వెనుక ఉన్న వ్యూహమేంటన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

 టీడీపీ-జనసేన పొత్తు

టీడీపీ-జనసేన పొత్తు

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎటొచ్చీ వీరి పొత్తులో బీజేపీ ఉంటుందా లేదా అనేదే చర్చ. రెండు నెలల క్రితం ఈ పొత్తులపై తీవ్రంగా చర్చ సాగినా.. ఎన్నికల ఏడాదిలోకి ఎంటరైన తర్వాత మాట్లాడుకుందామని భావించి ఇరు పార్టీలు సైలెంట్ అయిపోయాయి. అప్పటివరకూ ఎవరి దారిలో వారు రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిద్దామని డిసైడ్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఇరు పార్టీల నేతలు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడం కూడా దాదాపుగా మానేశారు. ఏదైనా అంశం ఉంటే తప్ప పవన్, చంద్రబాబు, లోకేష్ ఒకరి గురించి మరొకరు బహిరంగంగా మాట్లాడుకోవడం లేదు. కానీ తాజాగా ఇందులో మరో అంశం చేరింది.

పరస్పర ఫిరాయింపులు

పరస్పర ఫిరాయింపులు

తాజాగా జనసేనతో కూటమిలో ఉన్న బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనిపై బీజేపీ స్పందన ఎలా ఉన్నా.. జనసేన మాత్రం స్పందించలేదు. గతంలో కన్నా జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం కూడా బాగా సాగింది. పవన్ కు మద్దతుగా కన్నా బీజేపీలో ఉన్నప్పుడే చాలా వ్యాఖ్యలు చేశారు. అయినా జనసేనను కాదని టీడీపీలోకి వెళ్లారు. అలాగే ఇప్పుడు టీడీపీలో ఉన్న వంగవీటి రాధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరతారంటూ తాజాగా సంకేతాలు వస్తున్నాయి. ఈ లీకులు ఇస్తోంది కూడా జనసేన పార్టీనే. దీంతో ఈ ఫిరాయింపుల వెనుక ఏముందనే చర్చ మొదలైంది.

ఫిరాయింపులపై మౌనం

ఫిరాయింపులపై మౌనం

కన్నా టీడీపీలో చేరికపై జనసేన నోరెత్తలేదు, అలాగే ఇప్పుడు తమ పార్టీలో ఉన్న వంగవీటి రాధా జనసేనలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్నా టీడీపీ స్పందించడం లేదు. భవిష్యత్తులో ఇరు పార్టీల నుంచి మరికొందరు నేతలు కూడా పరస్పరం పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే వీరికి సొంత పార్టీల నుంచి ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. పార్టీ మారతారని తెలిసినా చర్చించి వారిని వారించే పరిస్దితీ లేదు. దీంతో ఈ ఫిరాయింపులు పరస్పర అవగాహనతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన వ్యూహమిదే ?

టీడీపీ-జనసేన వ్యూహమిదే ?


రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ సమయంలో టీడీపీ-జనసేన ఇరు పార్టీల్లో కాస్తో కూస్తో హైలెట్ అవుతున్న నేతలంతా వైసీపీ వైపు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ వైసీపీ టికెట్ ఇస్తుందని గ్యారంటీ లేకపోయినా వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వారు తమ పార్టీల్ని వీడి వైసీపీలోకి వెళ్లడం కంటే భవిష్యత్తులో పొత్తును దృష్టిలో ఉంచుకుని పరస్పరం పార్టీలు మారేందుకు ఈ రెండు పార్టీలు అనుమతిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కన్నా, వంగవీటి విషయంలో టీడీపీ-జనసేన మౌనంగా ఉండిపోతున్నాయి. రాజకీయంగా ఎవరి అవకాశాలు వారు వాడుకుని బలపడటం ద్వారా ఎన్నికల ముందు పొత్తు ప్రకటించి లబ్ది పొందాలనేది ఇరు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+