పార్లమెంట్లో రఘురామ వర్సెస్ వైసీపీ ఎంపీ వాగ్యుద్ధం ! అసలేం ఏం జరిగిందంటే ?
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత రెబెల్ గా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజుతో వైసీపీ ఎంపీలు గతంలో పలుమార్లు పార్లమెంటులో వాగ్వాదానికి దిగారు. రెబెల్ గా మారి సొంత పార్టీపై రఘురామ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇవాళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రెబెల్ ఎంపీ రఘురామపై మరో వైసీపీ ఎంపీ వాగ్వాదానికి దిగారు. అయితే రఘురామ కూడా అంతే దీటుగా ఆయనపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్ హాల్ కు వచ్చిన వైజాగ్ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తారసపడ్డారు. అంతే రఘురామపై ఎంవీవీ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ కూడా ఒక్కక్షణం అవాక్కయ్యారు.ఆ తర్వాత ఎంవీవీ విమర్శలపై స్పందించి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మిగతా ఎంపీలంతా వీరిద్దరిని సముదాయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇంతకీ అసలు ఎంవీవీ, రఘురామ మధ్య ఇవాళ వాగ్యుద్ధానికి దారితీసిన కారణమేంటో తెలుసా వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం. ఈ కిడ్నాప్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో రఘురామరాజు స్పీకర్ ఓం బిర్లాకు, హోంశాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారం తర్వాత రఘురామకూ, వైజాగ్ ఎంపీ ఎంవీవీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాంటిది ఇవాళ ఎదురుపడగానే ఎంవీవీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా కుటుంబం గురించి స్పీకర్, హోంశాఖకు లేఖలు రాయడనికి నువ్వెవరు అంటూ రఘురామను వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ ఏదో సర్దిచెప్పబోయారు. కానీ ఎంవీవీ శాంతించలేదు. వివాదం పెద్దదవుతున్న తరుణంలో మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వచ్చి ఎంవీవీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. గతంలోనూ మరో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా పార్లమెంటులోనే రఘురామపై తిట్ల వర్షం కురిపించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications