ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 21 మంది IPS లు బదిలీ
ఏపీలో పాలనా యంత్రాంగంలో మార్పుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ గా మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ గా కృష్ణకాంత్ పటేల్ బదిలీ అయ్యారు. సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణాను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా కే. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఈ. జీ. అశోక్ కుమార్ నియమితులయ్యారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా యంత్రాంగంలో మార్పుల్లో భాగంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ గా మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ గా కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేశారు. సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఇంటెలిజెన్స్ ఎస్పీగా కే. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఈ. జీ. అశోక్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఇటీవల ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగులను.. వారి స్వంత రాష్ట్రానికి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సొంత రాష్ట్రానికి బదిలీ కానున్న వారిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ బదిలీ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications