అనంతపురం:వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి నేత రమేష్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తాడిపత్రి నియోజకవర్గం కు సంబంధించి వైసిపి పార్టీకి కీలక నేత అయిన రమేష్ రెడ్డి ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు.

అతడు రమేష్ రెడ్డిపై దాడికి యత్నించిన నేపథ్యంలో రమేష్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో ఆ అగంతకుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దుండగుడికి కాలి మీద బుల్లెట్ తగిలి గాయపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన ఆ అగంతకుడిని తాడిపత్రిలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ap ananthapuram ycp leader ramesh reddy gun shot creat sensation

అయితే రమేష్ రెడ్డి ఇంట్లోకి చొరబడిందెవరు...? ఎందునిమిత్తం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు?... రమేష్ రెడ్డిపై దాడి నిమిత్తం అతనిని ఎవరైనా పంపారా?...తదిదర వివరాలు ఆ అగంతకుడు నోరు విప్పితే గాని బయటకు తెలిసే అవకాశం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం బుల్లెట్ దెబ్బకు గురై ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆ దుండగుడు కొంచెం కోలుకున్న అనంతరం పోలీసులు నేరుగా అతడినే విచారించే అవకాశం ఉంది. అనంతరం ఈ ఘటనపై స్పష్టత లభిస్తుందని, పూర్తి స్థాయిలో విచారణకు తోడ్పడుతుందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Gun shot incident occurred in the home of Ananthapuram district Tadipatri constistency YCP leader Ramesh Reddy created sensation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X