తొలిసారిగా..నేటి సాయంత్రమే: జగన్ ..చంద్రబాబు..పవన్ కలయిక: కేసీఆర్ సైతం అక్కడికే..!
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి..మాజీ ముఖ్యమంత్రి ఒకే చోటకు వస్తున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత అప్పటి హోదా లు తారు మారయ్యాయి. మీడియా సమావేశం ద్వారా జగన్‌కు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి జగన్ ఫోన్ చేసి ఆహ్వానించినా చంద్రబాబు హాజరు కాలేదు. ఇక, ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు వస్తున్నారు. ఇదే వేదిక వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రానున్నారు. మరి..అక్కడ ఏం జరగనుంది. ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాల తరువాత తొలి సారిగా కలుస్తున్న వేల..ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి...
హైదరాబాద్‌కు జగన్..అక్కడే బాబు..
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతుల చేపట్టిన తరువాత జగన్ అధికారిక హోదాలో తొలి పర్యటన హైదరాబాద్ వెళ్తున్నారు . అక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. ఇదే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం రాజ్‌భవన్ నుండి ఆహ్వానం వెళ్లింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఈ సారి ఇఫ్తార్ విందుకు హాజరవుతారని చెబుతున్నారు. ఇక, రాజ్‌భవన్‌లో ఏ కార్యక్రమం జరిగిన తప్పని సరిగా హాజరయ్యే జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ఆయన సైతం రాజభవ్‌న కార్యక్రమానికి వస్తారని తెలుస్తోంది. దీంతో..ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత ఈ ముగ్గురూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్నారనే సమాచారంతో రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ ఇద్దరి మీదే ప్రధాన దృష్టి..
ఎన్నికల ప్రచారంలో హోరా హోరీ తలపడిన టీడీపీ-వైసీపీ-జనసేన అధినేతలు ఇప్పుడు ఎన్నికల పలితాల తరువాత ఒకే చోటకు వస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేతగా..పవన్‌కళ్యాణ్ జనసేన అధినేతగా ఆహ్వానం అందుకున్నారు. అయితే, చంద్రబాబు ..పవన్ కు జగన్ స్వయంగా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినా..వారిద్దరూ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు గవర్నర్ ఆహ్వానించటం తో అందునా ఇఫ్తార్ విందు కావటంతో వీరిద్దరూ వస్తారని చెబుతున్నారు. ఇక, వీరంతా ఒకే చోటకు వస్తుండటంతో ఎలా వ్యవహరిస్తారు..ఎటువంటి సన్నివేశాలు కనిపిస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కటిగా ఉంటూ వస్తున్నారు. జగన్-కేసీఆర్ ఈ కార్యక్రమంలో సైతం ప్రత్యేకార్షణగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు హాజరు గురించి అనుమానాలూ ఉన్నాయి. ఆయన వస్తారని గ్రేటర్ టీడీపీ నేతలు చెబుతుంటే..ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లటం అనుమానమనే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications