"కొన్ని కోర్కెలు తీరవు"-వైసీపీపై రఘురామ సెటైర్లు..!
ఏపీలో గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లే రావడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ ఆ తర్వాత దాని కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీకి విపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో అసెంబ్లీకి రాకపోవడం లేదా, వచ్చినా కాసేపు నిరసన తెలిపి వెళ్లిపోవడం చేస్తున్నారు. అయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రమ్మని కోరుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో రఘురామ తాజాగా వైసీపీపై ఓ సెటైర్ వేశారు.
బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తనను చావు వరకూ తీసుకెళ్లిందన్నారు. అలాగే సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని, అయినా వారు హాజరు కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో సభాధ్యక్ష స్ధానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ జోక్యం చేసుకున్నారు.

మామూలుగానే పంచ్ లకు పెట్టింది పేరైన రఘురామరాజు.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాలని కోరుకుంటున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కొన్ని కోర్కెలు తీరవు అంటూ వ్యాఖ్యానించారు.
అంటే తాను కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటూ కోరుకుంటున్నా వారు మాత్రం రావడం లేదనే అర్ధంలో ఆయన ఈ వ్యాఖ్య చేసి ఉంటారని సభలో ఉన్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రఘురామ వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీకి రమ్మని కోరారు. తాజాగా జగన్ కు సైతం విపక్ష హోదా లేకపోయినా ముందు వరుసలో సీటు కూడా కేటాయించారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కావడం లేదు.












Click it and Unblock the Notifications