చంద్రబాబు పేరు సిఫార్సు చేయండి : బాబు అంగీకరిస్తారా: వైసీపీలో కొత్త చర్చ..!
ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తరువాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అంత వరకూ ఓకే. కానీ, ప్రమాణ స్వీకారం చేయించాలంటే తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేయాలి. ఇప్పుడున్న సభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరుండాలి. ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఇదే చర్చ వైసీపీలో మొదలైంది. ఇద సమయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి..

ప్రాటెం స్పీకర్‌గా ఎవరికి ఛాన్స్.
ప్రస్తుత శాసనసభలో ముఖ్యమంత్రిగా జగన్..ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉంటున్నారు. మొత్తం 175 సభ్యులు ఉండే ఈ సభలో తొలుత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దీని కోసం జూన్ పదో తేదీ తరువాత ఏపీ శాసనసభ సమావేశం కానుంది. 2014 ఎన్నికల్లో అందరి కంటే సీనియర్‌గా ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ తరువాత కోడెల శివ ప్రసాద రావును ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఇప్పుడు శాసనసభలో అధికార పార్టీ వైసీపీలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కర్నూలు జిల్లా పాణ్యం నుండి గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఆరు సార్లు గెలిచారు. అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి, అదే జిల్లా కోవూరు నుండి గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఆరు సార్లు గెలిచారు. వైసీపీ నుండి ప్రొటెం స్పీకార్‌గా అవకాశం ఇవ్వాలంటే ఈ ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది.

టీడీపీ నుండి ఇద్దరు..
ఇక, టీడీపీ నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. గోరంట్ల బచ్చయ్య చౌదరి సైతం ఆరు సార్లు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సహజంగా అధికార పార్టీలోని సీనియర్ నేతకే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కుతుంది. ఈ సారి కాటసాని రాం భూపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, మరో చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం సభలోనే సీనియర్ గా ఉన్న టీడీపీ అధినేత..ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాలని..దీనిపైన గవర్నర్‌కు సిఫార్సు చేయాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ విషయంలో జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

చంద్రబాబు ఎందుకంటే...
చంద్రబాబు కాంగ్రెస్ నుండి తొలుత 1978లోనే చంద్రగిరి నుండి తొలి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఇక, 1989 నుండి 2019 వరకు వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే మొత్తంగా ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక నేత. అదే విధంగా..ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు ఉంటే ఏకంగా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుందని..అది అరుదైన అవకాశంతో పాటుగా..వైసీపీ ఎమ్మెల్యేతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించటం అనేది చరిత్రలో నిలిచిపోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, నిజంగా ప్రభుత్వం నుండి ఆ ప్రతిపాదన వచ్చినా..ప్రొటెం స్పీకర్‌గా ఉండేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది సందేహమే. అయితే, స్పీకర్ విషయంలో మాత్రం జగన్ అనేక కోణాల్లో ఆలోచన చేస్తున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications