హైదరాబాద్ లోనే అసెంబ్లీ సమావేశాలు, సచివాలయంపై మంత్రుల అసంతృప్తి
విజయవాడ : రాబోయే అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నేటి కేబినెట్ భేటిలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 6వ తేదీన మొదలయ్యే ఈ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు జరగనున్నాయి.
కృష్ణా పుష్కరాలపై కూడా చర్చించిన కేబినెట్.. పుష్కరాల ముగింపు సందర్బంగా.. ఈనెల 23వ తేదీ రాత్రి పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చ జరిపినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. వెలగపూడిలో నిర్మిస్తోన్న నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం ఏర్పాట్లపై పెదవి విరుస్తున్నారు ఏపీ మంత్రులు. సచివాలయ బ్లాక్ లపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. పలు మార్పులు చేయాలని అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. చాంబర్ల వైశాల్యంలో హెచ్చు తగ్గులకు సంబంధించి మంత్రులు వ్యక్తం చేసిన అభ్యంతరం మేరకు ఐదో చాంబర్ లో వైశాల్యం పెంచేందుకు నిర్మాణ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications