నిమ్మగడ్డకు ఏపీ అసెంబ్లీ నోటీసులు- సెలవుపై వెళ్లకుండా- కొంపముంచిన పరిషత్ పోరు
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గతంలో గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇరుకునపడ్డారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే పలుమార్లు విచారణ నిర్వహించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి సాయంతో నోటీసులు పంపింది. ఇందులో నిమ్మగడ్డ తమ విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
పరిషత్
పోరుకు
జగన్
పట్టు-
కుదరదంటున్న
నిమ్మగడ్డ-
ప్రివిలేజ్
నోటీసు
లీకుల
వెనుక
?

నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసులు
ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటీసులు పంపారు. గతంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సపై గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాధమిక విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు నోటీసులు పంపారు. ఇందులో నిమ్మగడ్డ.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కారుకూ, నిమ్మగడ్డకూ మధ్య మరో వివాదానికి కారణమవుతోంది.

ప్రివిలేజ్ కమిటీ విచారణల పర్వం
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నిమ్మగడ్డ తీరుపై ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ పలుమార్లు విచారణ నిర్వహించింది. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా మంత్రులు చేసిన ఫిర్యాదులో అంశాలు, రాజ్యాంగ నిబంధనలు, సభ్యుల హక్కులు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తదుపరి విచారణకు నిమ్మగడ్డ అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నోటీసులు పంపింది.

నిమ్మగడ్డ సెలవును అడ్డుకునేందుకేనా ?
ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో నిమ్మగడ్డ నాలుగు రోజుల పాటు సెలవులో వెళ్లేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిమ్మగడ్డ సెలవుపై వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిమ్మగడ్డ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు. అంతలోనే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. విచారణకు అందుబాటులో ఉండాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించిన నేపథ్యంలో నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయం కూడా ఉత్కంఠ రేపుతోంది.

నిమ్మగడ్డ కొంప ముంచిన పరిషత్ పోరు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న వైసీపీ సర్కారు ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరు కూడా జరిపించాలని కోరుకుంటోంది. కానీ నిమ్మగడ్డ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో ఆగిన చోట నుంచి పరిషత్ ఎన్నికల నిర్వహణకు విపక్షాలు సుముఖంగా లేవు. అలాగని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే పరిస్ధితి లేదు. దీంతో న్యాయపరమైన అంశాల్ని పక్కనబెట్టి ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్ధితుల్లో నిమ్మగడ్డ సెలవు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ తీరును సీరియస్‌గా తీసుకుని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.