AP Assembly sessions:అసెంబ్లీకి వైసీపీ హాజరవుతుందా..?
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 11 సోమవారం ప్రారంభం అవుతాయి . ఇప్పటికే గవర్నర్ గెజిట్ కూడా విడుదల చేశారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కనుక సభ వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం గత సమావేశాల్లో ఆమోదించింది. ఇక ఈసారి నాలుగు నెలలకు గాను అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈ సమావేశాల్లో పలు చట్ట సవరణలు చేయడంతో పాటు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్.సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం అమరావతికి సబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications