సైనికులకు అండగా స్పీకర్ అయ్యన్న-ఏం చేశారో తెలుసా ?
పహల్గాం దాడికి ప్రతీకారం భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో వేలాది మంది భారత సైనికులు ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో పోరాడుతున్నారు. దీంతో సరిహద్దుల్ని రక్షిస్తున్న భారత బలగాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో సైనికులకు అండగా నిలిచేందుకు రాజకీయ నేతలు, అధికారులు, ప్రజలు ఇలా ఎవరికివారు తమకు తోచిన సాయం కూడా అందిస్తున్నారు.
ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ అయన్నపాత్రుడు కూడా ముందుకొచ్చారు. జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా పంపారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన విడుదల చేశారు. తద్వారా యుద్ధంలో పోరాడుతున్న సైనికులకు ఆయన అండగా నిలిచారు.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగించే అంశం అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు నా వంతుగా సంఘీభావంగా నా నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చానన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయి అని స్పీకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications