వైసీపీకి స్పీకర్ తాజా షాక్-త్వరలో నోటీసులు-జగన్ పై క్లారిటీ..!
ఏపీలో అసెంబ్లీ (ap assembly) సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరై ఆ తర్వాత మొహం చాటేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఏ చర్యలు తీసుకోవాలో తెలియని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదువుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ స్పీకర్ (speaker) చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో కేంద్రం సాయం కోరబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు (ysrcp mlas) సభకు రాకుండా జీతాలు తీసుకొంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం రోజు వారు సభకు హాజరైనా పరిగణలోకి రాదని ఆయన తేల్చేశారు.వరుసగా 65 రోజులు హాజరుకాకపోతే నోటీసులు ఇస్తామని ఆయన హెచ్చరికలు చేశారు. అయితే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే చట్టాలు పార్లమెంట్‌లో చేయాలని ఆయన కోరారు.

ఈ మేరకు సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని లోక్ సభ స్పీకర్‌ను సంప్రదిస్తానని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మరోవైపు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోమని బీష్మిస్తున్న నేపథ్యంలో. . ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని అయ్యన్నపాత్రుడు మరోసారి తేల్చిచెప్పేశారు. దీంతో స్పీకర్ వర్సెస్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రతిష్టంభన మరికొంతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తేలిపోయింది. అటు పార్లమెంట్ దీనిపై చట్టం చేసే అవకాశాలు కూడా లేకపోవడంతో ఈ ప్రతిష్టంభనకు ఇప్పట్లో చెక్ పడేలా కనిపించడం లేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!











Click it and Unblock the Notifications