మళ్లీ నిప్పులుచెరిగిన స్పీకర్ సీతారాం - అప్పుడు వైసీపీకీ టీడీపీ గతే - అచ్చెన్నపై అప్పల్రాజు ఫైర్
రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, వ్యవస్థల పట్ల సంయమనం పాటించాల్సిన వ్యక్తి కాస్తా.. రాజకీయ కామెంట్లు చేయడం తగదంటూ హైకోర్టు చేత విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ప్రతిపక్ష టీడీపీపై నేరుగా పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మంత్రి సీదరి అప్పలరాజుతో కలిసి సోమవారం శ్రీకాకుళంతో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీసీ కార్పొరేషన్లపై కామెంట్లా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 56 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లు, డైరెక్టను సైతం నియమించిన నేపథ్యంలో.. కార్పొరేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి మేలు జరగబోదని, చైర్మన్ పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావని ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేయడం తెలిసిందే. కార్పొరేషన్లను, వాటి చైర్మన్లను కించపర్చేలా అచ్చెన్న మాట్లాడటం కరెక్టు కాదని స్పీకర్ సీతారాం అన్నారు. అంతటితో ఆగకుండా..

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు..
‘‘నామినేటెడ్ పోస్టులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే. ఆ పదవులు నాలుక గీచుకోవటానికి కూడా పనికిరావనడం సబబుకాదు. అసలు టీడీపీ హయాంలో బీసీలకు పదవులు ఎందుకు కేటాయించలేదు?'' అని స్పీకర్ ప్రశ్నించారు. తప్పులు చేసినందుకే టీడీపీ అధికారం కోల్పోయిందని, ఒకవేళ తాము(వైసీపీ) కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని సీతారాం అన్నారు.
Recommended Video

అచ్చెన్న వచ్చాకే బీసీ పార్టీనా?
‘‘అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు కాగానే టీడీపీ బీసీల పార్టీగా మారిందా? గతంలో అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు బీసీ కాదా? అసలు టీడీపీ హయాంలో బీసీలకు ఏం చేశారో అచ్చెన్న చెప్పాగలరా? సీఎం జగన్ సదుద్దేశంతో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వాటిని చులకన చేసి మాట్లాడటం కరెక్టేనా?'' అని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications