AP Assembly: అసెంబ్లీలో టీడీపీ రచ్చరచ్చ-ఎమ్మెల్యేల సస్పెన్షన్-బయట సర్పంచ్ ల నిరసన..

ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఓవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై గుర్రుగా ఉన్న విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ కూడా ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభలో వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్ధితి మారిపోయింది. మరోవైపు అసెంబ్లీ బయట రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సర్పంచ్ లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చ కోరుతూ విపక్ష టీడీపీ ఇవాళ స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చింది. ధరల పెరుగుదలపై ప్రభుత్వం చర్చించాలని పట్టుబట్టింది. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేపర్లు చించేసి స్పీకర్ పై విసురుతూ టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ తీరుపై మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Assembly: tdp mlas suspended for today amid protests in the house, sarpanches arrests outside

మరోవైపు అసెంబ్లీ బయట సర్పంచ్ లు నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సర్పంచ్ లను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్ లు ఛలో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని, వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు స్ధానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.

అటు అసెంబ్లీలో నిరసనలకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను వారించేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఇవాళ ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సభ ఆమోదించింది. అనంతరం టీడీపీ సభ్యులు అసెంబ్లీ బయటకు వెళ్లి నిరసనలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+