వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ వాకౌట్: స్పీకర్‌పై చెవిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శనివారం వాకౌట్ చేసింది. వాకౌట్ అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో జరిగిన సంఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గు చేటుగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఒక శాసనసభ్యుడికి మైకు ఇచ్చి, చర్చ మొదలు పెట్టాలంటే.. హత్యలు, ఊచకోతలపై మాట్లాడమంటే దాని మీద వివరించాల్సిన తమ గొంతు నొక్కేసి టిడిపి సభ్యుడు బుచ్చయ్య చౌదరికి అవకాశం ఇచ్చారని, బుచ్చయ్య చౌదరి అసలు విషయం వదిలేసి చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం, విదేశాలు అంటున్నారని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు

బుచ్చయ్య చౌదరి అసత్యపు ఆరోపణలు చేస్తుంటే స్పకీర్‌ చెవికి ఇంపుగా ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ఆనందంగా ఉందా అని ఆయన అడిగారు. అలాంటి సందర్భంలోనే స్పీకర్‌ను జగన్ అడిగారని, అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారంటే పది సెకన్లు మాట్లాడనివ్వకుండా మైకు కట్ చేసి మళ్లీ బుచ్చయ్య చౌదరికి అవకాశం ఇచ్చారని ఆయన వివరించారు.

AP assembly: YSRCP stgaes walkout

ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ చేస్తానని అన్నప్పుడు కనీసం మైకు ఇచ్చి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నానయి, వాటిని అధికార పార్టీ గానీ ప్రతిపక్షం గానీ పట్టించుకున్నట్లు లేవని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నిబంధనలు పట్టించుకోకుండా, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు స్పీకర్‌గా ఎందుకు ఉన్నారని ఆయన అడిగారు. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజల తరఫున మాట్లాడడానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షంగా తాముంటే, తమ గొంతు నొక్కేస్తారా, ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. నిండు సభలో ప్రతిపక్ష నేత మీద నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేస్తుంటే పట్టించుకోకపోవడం బ్లాక్ డే అని ఆయన అన్నారు. మంత్రులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

మంత్రులకు పుచ్చలపల్లి సుందరయ్య పేరు ఎత్తే అర్హత లేదని, వాళ్లే బతికి ఉంటే వారి తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునేవారని ఆయన అన్నారు. అసెంబ్లీని టిడిపి కార్యాలయంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా అని ఆయన అడిగారు. అది దుర్మార్గం, అమానుషంమని, ప్రజలనూ ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేయడమని ఆయన అన్నారు. కవి చౌడప్ప వారసుల్లా వారంతా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

English summary

 After staging walkout YSR Congress MLA Chevireddy Bhaskar Reddy has made severe comments against Andhra Pradesh assembly speaker Kodela Shivaprasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X