ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? పురందేశ్వరి అంచనా ఇదే..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో కలిపి బీజేపీ జట్టు కట్టింది. ఎన్డీయే కూటమి రూపంలో మూడు పార్టీల అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన ఈ మూడు పార్టీల్ని ప్రజలు ఆదరించారా, జూన్ 4న జరిగే కౌంటింగ్ లో ఏం తేలబోతోందన్న ఉత్కంఠ వీరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి పక్షాల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ మౌనంగా ఉన్నారు. కానీ బీజేపీ ఏపీ ఛీఫ్ పురందేశ్వరి మాత్రం నోరువిప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. వెబెక్స్ వీడియోలో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన పురందేశ్వరి.. పోలింగ్ జరిగిన తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేతలకు కీలక సూచనలు చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాల న్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు 500 ఓట్లకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ విషయం లో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇవ్వాలన్నారు.
ఎన్నికల సమయంలో కష్టించి పని చేసిన కార్యకర్తల ఇళ్ళ కు వెళ్లి బీజేపీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలపాలన్నారు.
ఎన్నికల సమయంలో కూటమి లో ఉన్న పార్టీలు ఎంత సమన్వయం తో పని చేసామో కౌంటింగ్ ప్రక్రియ లో కూడా అంతే సమన్వయం తో పని చేద్దామని పురందేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో కష్టించి పని చేశారని పురందేశ్వరి కితాబిచ్చారు. వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో విస్తారక్ లు చేసి న కృషిని కూడా ప్రస్తావించారు. బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పార్టీ పని విధానాన్ని ఈ సందర్భంగా వివరించారు.












Click it and Unblock the Notifications