9 వేల ఎకరాల్లో కొత్త రాజధాని- రైతులకు 64 వేల ప్లాట్లు- సోము సంచలన కామెంట్స్‌..

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియపై ఇప్పటివరకూ ఓ క్లారిటీ లేదు. రాజధానులపై వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్‌ ఆమోదం కూడా ఉన్నప్పటికీ న్యాయస్ధానాల్లో మాత్రం ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ లభించలేదు. దీంతో రాజధాని తరలింపు వ్యవహారం కూడా ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

కానీ ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు అమరావతి విషయంలోనూ అసంతృప్తిగా ఉన్న బీజేపీ నేతలు రోజుకో రకంగా మాట్లాడుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా ఇదే కోవలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన విశాఖ పర్యటనలో రాజధానిపై మరో సంచలన వ్యాఖ్య చేశారు. తాము 2024లో అధికారంలోకి వస్తే 9 వేల ఎకరాల్లో రాజధాని కట్టి చూపిస్తామన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తప్పులే చేస్తున్నాయని సోము తెలిపారు.

ap bjp chief somu veerraju says he will construct new capital in 9k acres

తమకు అధికారం ఇస్తే అమరావతిలో రైతులకు 64 వేల ప్లాట్లు ఇచ్చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.7200 కోట్లు ఇస్తే చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే కేంద్రం వైఖరి ప్రకారం సమర్ధిస్తున్న బీజేపీ.. రాజకీయంగా మాత్రం అమరావతికే మద్దతు పలుకుతోంది. ఇక్కడి రైతులకు న్యాయం చేసి తీరుతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. దీంతో సోము చెప్పిన 9 వేల ఎకరాల రాజధాని అమరావతిలో ఉంటుందో లేదో తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+