పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే-సోము వీర్రాజు కామెంట్స్

గోదావరి నదికి ఈ ఏడాది వచ్చిన వరదలతో పోలవరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల వందలాది గ్రామాలు మునిగిపోతాయని గతంలో ఆరోపించిన తెలంగాణ అభ్యంతరాలతో ముంపు మండలాల్ని కేంద్రం ఏపీలో చేర్చింది. ఇప్పుడు అవే గ్రామాలు మునగడంతో తెలంగాణ విమర్శలు మొదలుపెట్టింది. దీనికి ఏపీవైపు నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఏపీలో కలిపిన ఏడు మండలాలపై తెలంగాణ నేతలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. పోలవరం అంశాన్ని‌ వివాదాస్పదం చేసే కుట్ర జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, పోలవరంను ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించి నట్లేనని సోము విశ్లేషించారు. అలాగే రాష్ట్ర విభజన అంశాన్ని కూడా తిరగతోడినట్లేనని సోము అన్నారు.

ap bjp chief somu veerraju says questioning polavaram is questioning telangana formation

రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని, విభజన తరువాత భద్రాచలం ఆలయాన్ని , మరో రెండు మండలాలు‌ తెలంగాణకు కేటాయించారని సోము తెలిపారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్‌కు‌ నీరు ఇవ్వాలని‌ ఆనాడు వైయస్ పనులు చేపట్టారని, దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని సోము విమర్శించారు. దీంతో కేంద్రంపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు సోము కౌంటర్ ఇచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+