పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానిద్దాం : ఏపీలో దూకుడు పెంచాల్సిందే : బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం..!!

ఏపీలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అధినాయకత్వం ఏపీ నేతలు దిశా నిర్ధేశం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో టీడీపీ..వైసీపీలకు సమ దూరం పాటించాలని నిర్ణయించారు. చేశారు. బీజేపీ సంస్థాగతంగా ఎదిగేందుకు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. స్థానికసంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలని, హైకమాండ్‌ తరపున సమావేశంలో రాంమాధవ్‌ దిశానిర్దేశం చేశారు. ఏపీలోనూ దూకుడు పెంచాలని నిర్ణయించారు.

ఏపీలో దూకుడు పెంచాల్సిందే..
తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని బీజేపీ అధినాయకత్వం ఏపీ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేసింది. ఏపీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల పైన కన్నా నివాసంలో కోర్ కమిటీ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అధిష్ఠానం ప్రతినిధులు రాం మాధవ్..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ థియోధర్ హాజరయ్యారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ సభ్యులుతో పాటుగా ఏపీ నేతలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. పోలవరం, రాజధాని విషయాల్లో ముందుకే వెళ్లాలని తీర్మానం చేశారు. పోలవరంపై పీపీఏ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతిలో నిర్మాణాలను కొనసాగించేలా.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నేతలు నిర్ణయించారు. గత ప్రభుత్వం తప్పుచేస్తే శిక్షించాలి.. కానీ ప్రాజెక్టులు నిలిపివేయొద్దన్నారు. బీజేపీలో విభిన్న అభిప్రాయాలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం సఖ్యతగా ఉంటుందనే కారణంతో ఇక్కడ మౌనంగా ఉండకూడదని.. ఇప్పుడు రాజకీయంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తీర్మానించారు.

AP BJP core committee decided to maintain same distance with TDP and YCP

పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానిద్దాం..
పార్టీలో అందరూ ఒకే తాటి పైన ఉండే విధంగా నడుచుకోవాలని రాం మాధవ్ స్పష్టం చేసారు. విజయవాడ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ధేశించారు. ఏపీలో ఏ పార్టీతోనూ ప్రస్తుతానికి పొత్తులు లేవని.. ఒంటరిగా ఎదిగేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిందేనని తీర్మానం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులనూ ఎండగట్టాలని, తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ సంస్థాగతంగా ఎదిగేందుకు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. స్థానికసంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలని, హైకమాండ్‌ తరపున సమావేశంలో రాంమాధవ్‌ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ను ఏపీ పర్యటనకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+