• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రం చెప్పేదొకటి, బీజేపీ చేసే దొకటి-ఏపీలో బయటపడిన డబుల్ గేమ్-అడ్డంగా దొరికిన వైనం

|

ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య గత కొంతకాలంగా పోరు సాగుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకిు వచ్చాక కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతున్న సీఎం జగన్ .. తాజాగా రూటుమార్చడంతో ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వీలు దొరికినప్పుడల్లా జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతోంది. అయితే ఈ క్రమంలో తమ సొంత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సైతం పట్టించుకోవడం లేదు. రాజకీయం కోసం డబుల్ గేమ్ ఆడేందుకు సైతం సై అంటోంది. దీంతో వైసీపీ కూడా కౌంటర్ వ్యూహం రెడీ చేసుకుంటోంది.

 కేంద్రంతో జగన్ సంబంధాలు

కేంద్రంతో జగన్ సంబంధాలు

2019కు ముందు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తో అంటీ ముట్టనట్టుగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మాత్రం సత్సంబంధాలు నెరుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో కీలక బిల్లుల విషయంలోనూ మంచీ చెడూ ఆలోచించకుండా కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు వైసీపీ అండగా నిలిచింది. అయితే ఆ మేరకు రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడంలో మాత్రం విఫలమైంది. దీంతో సీఎం జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసమే బీజేపీని వాడుకుంటున్నట్లు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే క్రమంలో తాజాగా తనను టార్గెట్ చేస్తున్న బీజేపీపై కౌంటర్లు వేసేందుకు జగన్ వైసీపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

 బీజేపీ వర్సెస్ వైసీపీ పోరు

బీజేపీ వర్సెస్ వైసీపీ పోరు

కేంద్రంలోని మోడీ సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో విఫలమైన జగన్ సర్కార్ ఇప్పుడు విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇదే క్రమంలో బీజేపీ కూడా వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తోంది. గతేడాది ఆలయాలపై దాడుల విషయంలో, ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం విషయంలో, వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవధ వ్యాఖ్యల విషయంలో బీజేపీ నేతలు వైసీపీని పదే పదే టార్గెట్ చేశారు. దీంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ ఎట్టకేలకు వైసీపీ నేతలకు బీజేపీని కూడా వదిలిపెట్టొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు వరుసగా బీజేపీపై విరుచుకుపడ్డారు.

 మరింత రెచ్చిపోతున్న బీజేపీ

మరింత రెచ్చిపోతున్న బీజేపీ

ఎప్పుడైతే వైసీపీ సర్కార్ ఆత్మరక్షణలో ఉందని తెలిసిందో అప్పటి నుంచీ టార్గెట్ చేయడం మొదలుపెట్టిన బీజేపీ.. తాజాగా సీఎం జగన్ వైసీపీ నేతలకు ఇచ్చిన ఆదేశాలతో మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే క్రమంలో మరో కీలక అంశంలో వైసీపీ సర్కార్ ను ఇరుకునపెడుతోంది. అదే గణేష్ మండపాల వ్యవహారం. దీంతో వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసేందుకు బీజేపీ దీన్ని అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని సాధ్యమైనంత ఎక్కువగా ఇరుకునపెట్టేందుకు ఈ వ్యవహారాన్ని వాడుకుంటోంది. మతకోణంలో బీజేపీ ఈ విమర్శలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే పరిస్ధితి లేదు.

 గణేశ్ మండపాలపై జగన్ సర్కార్ ఆంక్షలు

గణేశ్ మండపాలపై జగన్ సర్కార్ ఆంక్షలు

ఏపీలో గణేశ్ మండపాలపై కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది. మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదు. గణేశ్ మండపాలకు అనుమతిస్తే కోవిడ్ వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించి మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారిపోతోంది. గతేడాది కూడా ఇదే పరిస్దితి. అప్పట్లో కోవిడ్ దృష్ట్యా మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వపోవటంతో బీజేపీ నేతలు ఇదే తరహాలో విమర్శలకు దిగారు.

 పండుగల సీజన్లో కేంద్రం మార్గదర్శకాలు

పండుగల సీజన్లో కేంద్రం మార్గదర్శకాలు

పండుగల సీజన్ ను దష్టిలో ఉంచుకుని కోవిడ్ వ్యాప్తి జరగకుండా కేంద్రం రాష్ట్రాలకు ఈ మధ్యే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం పండుగల సీజన్లో జనం ఎక్కువగా గుమికూడే ప్రమాదం ఉన్నందున ఆ మేరకు కోవిడ్ వ్యాప్తికి అవకాశాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. కాబట్టి రాష్ట్రాలు తాము ఇచ్చిన గైడ్ లైన్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో మిగతా రాష్ట్రాల తరహాలోనే ఏపీ కూడా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే గణేష్ మండపాలకు అనుమతులు నిరాకరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులతో ఆదేశాలు ఇప్పిస్తోంది.

  Ys Jagan సర్కార్ కు AP Roads తలనొప్పి.. గ్రౌండ్ రియాలిటీ!! || Oneindia Telugu
   బీజేపీ డబుల్ గేమ్ ఇలా

  బీజేపీ డబుల్ గేమ్ ఇలా

  దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో కరోనా వ్యాప్తికి అవకాశాలున్నాయంటూ కేంద్రం ఓవైపు రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అదీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్టీయే సర్కారే వాస్తవ పరిస్ధితుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీ బీజేపీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆ విషయం పట్టించుకోకుండా వైసీపీ సర్కార్ గణేశ్ మండపాలకు అనుమతులు నిరాకరించడంపై రాజకీయాలు మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే గణేశ్ మండపాలకు అనుమతులు ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు కూడా నిర్వహిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో బీజేపీ డబుల్ గేమ్ బయటపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లేకపోతే కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా దీనిపై ఆందోళనల ద్వారా ప్రజల్ని బీజేపీ నేతలు మభ్యపెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

  English summary
  andhrapradesh bjp seems to be playing double game over ganesh mantapams amid central govt's covid 19 guidelines implementation by targetting ysrcp govt.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X