సొంతపార్టీ నేతలపై.. ఏపీ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పార్టీలోని కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు పరోక్షంగా బీజేపీ నేత సోము వీర్రాజుపై మండిపడ్డారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్రికా సమావేశాలు, డిబేట్లలో చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలేనన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు, ప్రతిష్టలను మంటగలపాలని చూస్తున్నారని, ఈ విషయంపై పార్టీ జాతీయాధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ungaraala-chinababu

పార్టీకి సంబంధం ఉన్న, లేని వ్యక్తులు బీజేపీ నాయకుల గురించి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అవన్నీ వాళ్ల వ్యక్తిగతమని చినబాబు పేర్కొన్నారు. ఇలాంటి వారిపై జాతీయాధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

కొంతమంది కేవలం మీడియాలో కనబడాలనే ఉద్దేశంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లకు అలా మాట్లాడే అర్హత లేదని ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP BJP leader Ungaraala Chinababu critisized his own party leader somu veerrajau on Friday that the bjp leaders who are speaking on various issues with media are only their views but not the party views. He told that he will complained about this irresponsible way of talking to BJP National President.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి