2024లో ఓ పార్టీ జెండా పీకేస్తుంది! వైసీపీలో ఏక్ నాథ్ షిండేలు ! బీజేపీ విష్ణు షాకింగ్ కామెంట్స్
ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ వైసీపీ, టీడీపీ, జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న కామెంట్స్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ స్పందించారు. ఉండవల్లి.. ఊసరవెల్లి లకు ఎప్పుడు ఏం గుర్తు కు వస్తాయో తెలియదని ఈ మధ్య వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ జెండా పీకేస్తుందని విష్ణు జోస్యం చెప్పారు. వేలకోట్లు సంపాదించి పాదయాత్రలు చేస్తారంటూ లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు, వైసీపీ లో ఏక్ నాధ్ షిండేలు ఉన్నారని విష్ణు తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో ఇతర పార్టీలను కుటుంబపార్టీలు మింగేస్తున్నాయంటూ విష్ణు మరో సంచలన వ్యాఖ్య చేశారు.
వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. బిజెపి ని తక్కువ అంచనా వేయద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధితో తమ పార్టీ ఎన్నికల కు వెళుతుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేని నేతలు పార్టీ అనుమతి తీసుకున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ డుమ్మాపై విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదన్నారు.

తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు సీబీఐ వద్దన్నారని, ప్రతి పక్షంలో ఉండగా సీబీఐని రమ్మంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి విష్ణు విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాల నుండి రాలేదని విష్ణు తెలిపారు. బిజెపి,జనసేన ను విడగొట్టాలని కుట్ర పన్నుతున్నారని,
బిజెపి,జనసేన బందం మరింత బలపడుతోందని విష్ణు వెల్లడించారు.












Click it and Unblock the Notifications