ఈడీ నోటీసులకు నిప్పు స్పందించదే ? చంద్రబాబుపై బీజేపీ సెటైర్లు- ఢిల్లీ టూర్ వేళ ప్రాధాన్యం !
ఏపీలో గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అక్రమాలపై ఈడీ దర్యాప్తు సంచలనం రేపుతోంది. తన ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ స్కాంపై అప్పటి సీఎం, ఇప్పటి విపక్ష నేత చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఈడీ దర్యాప్తు జరుగుతుండగానే చంద్రబాబు జీ20 సమావేశాల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ స్పందించింది.
తన ప్రభుత్వ హాయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అక్రమాలపై ఇందులో పనిచేసిన అధికారులకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని ఏపీ బీజేపీ ఇవాళ ప్రశ్నించింది. అవినీతి లేని, నిప్పులాంటి పాలన అందించానని చెప్పుకునే చంద్రబాబు ఈడీ నోటీసులపై స్పందించకపోవడాన్ని బీజేపీ ప్రశ్నించింది. ఈ మేరకు ఏపీ బీజేపీ శాఖ ఓ ట్వీట్ చేసింది. ఇందులో చంద్రబాబుతో పాటు జగన్ నూ లాగింది.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అక్రమాలపై ఈడీ జరుపుతున్న విచారణపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించిన ఏపీ బీజేపీ.. అదే సమయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒక్కటేనని తెలిపింది. అవినీతిలో వైసీపీ, టీడీపీ ఇద్దరూ ఒక్కటేనని గుర్తుచేసింది. అవినీతిపై మాట్లాడే హక్కు ఈ రెండు పార్టీలకు లేదని ఏపీ బీజేపీ తన ట్వీట్ లో పేర్కొంది. తద్వారా ఇరు పార్టీలకు సమదూరం పాటిస్తామన్న సిద్ధాంతం నుంచి తాము దూరం జరగలేదన్న విషయాన్ని చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ గుర్తు చేసినట్లయింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బీజేపీకి తిరిగి దగ్గరవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఏపీ బీజేపీ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.













Click it and Unblock the Notifications