జగన్‌కు అమ్మవారి ఆశీస్సులు -బడ్జెట్‌పై స్వరూపానందేంద్ర -అర్చకులకు రూ.120కోట్లుపై హర్షం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు సదా ఉంటాయని, ఉండాలని విశాఖ శారద పీఠం అధినేత స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఏపీ సర్కారు గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై స్వరూపానంద హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిషికేశ్ లో ఉన్న ఆయన.. బడ్జెట్ పై తన ప్రతిస్పందనను మీడియాకు వెల్లడించారు..

ఏపీ బడ్జెట్ 2021-22లో అర్చకుల వేతనాలకు సంబంధించిన కేటాయింపులపై శారద పీఠం చీఫ్ స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని, అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు.

ap budget 201: swaroopanandendra appreciates cm jagan for allowing rs.120 cr for salaries of priests

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్‌ బడ్జెట్‌ తెచ్చింది. ఇందులో బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు.

కరోనా విలయం నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒకే రోజులోనే పూర్తి చేశారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని చేశారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ల కొరతపై సీఎం జగన్ తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ ను డొల్ల పద్దుగా అభివర్ణించాయి. బడ్జెట్ భేటీని బహిష్కరించిన టీడీపీ.. ఇవాళ మాక్ అసెంబ్లీ నిర్వహంచి జగన్ సర్కారు తీరును తప్పుపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+