AP Budget 2026: సంపద సృష్టికి కీలక ప్రకటన-చంద్రబాబు కలల ప్రాజెక్ట్..!

ఏపీలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ (AP budget 2026)ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో పలు సంక్షేమ పథకాలతో పాటు కీలక రంగాలకు నిధులు కేటాయింపులతో పాటు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో రాష్ట్రంలో సంపద సృష్టికోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రైవేటు పెట్టుబడిదారుల్ని సైతం భాగస్వాముల్ని చేయబోతున్నారు.

సీఎం చంద్రబాబు తరచూ చెప్పే మాట సంపద సృష్టి. ఇందుకు కార్యరూపం ఇస్తూ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఓ కీలక ప్రతిపాదన పెట్టారు. సంపద సృష్టిలో భాగంగా ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ లో కేశవ్ ప్రతిపాదించారు. రూ.100 కోట్ల కార్పస్ తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏపీ వెల్త్ ఫండ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుంది.

AP Budget 2026 Govt to Create Wealth Fund with 100 Crore Corpus Seeks Private Investors

ఈ మేరకు ఏపీ వెల్త్ ఫండ్ లో భాగస్వాములు కావాల్సిందిగా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నట్టు ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ దేశాలు ఇప్పటికే సావరిన్ ఫండ్ ద్వారా వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఓ నిధి ఏర్పాటు చేసి అందులో ప్రైవేటు పెట్టుబడిదారుల్ని భాగస్వాముల్ని చేస్తూ.. వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+