వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్ రూపంలో ఏపీ బడ్జెట్ .. ఇది జగన్ దుష్ట సాంప్రదాయం : యనమల ఫైర్

|
Google Oneindia TeluguNews

వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్ ను ఆర్డినెన్స్ రూపంలో వైసీపీ ప్రభుత్వం ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది . ఆర్డినెన్స్ బడ్జెట్ ను టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండో సారి కూడా రాష్ట్ర బడ్జెట్ పై ఆర్డినెన్స్ ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ఇది పూర్తిగా జగన్ దివాలాకోరుతనం అని , దుష్ట సాంప్రదాయమని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .

గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు జగన్ సర్కార్ యోచనగ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులకు జగన్ సర్కార్ యోచన

 పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెట్టాలని యనమల డిమాండ్

పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెట్టాలని యనమల డిమాండ్

పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యనమల డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం పెట్టిన ఆర్డినెన్స్ బడ్జెట్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ తీసుకునే నిర్ణయం పూర్తిగా పలాయనవాదం అని మండిపడిన యనమల రామకృష్ణుడు బడ్జెట్ కు కూడా ఆర్డినెన్సుల రూపంతో ఆమోదం పొందే దుష్ట సాంప్రదాయానికి జగన్ రెడ్డి తెర తీశారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరగలేదు

దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరగలేదు

ఏపీ ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలు అంటే లెక్క లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరగలేదన్నారు యనమల రామకృష్ణుడు.

రోజుకో కుంటిసాకులతో, దొంగ వంకలతో బడ్జెట్ వాయిదా వేసిన దాఖలాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతున్నా , పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా బడ్జెట్ పై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ లు ఇవ్వలేదని యనమల ఈ సందర్భంగా పేర్కొన్నారు .

గతంలోనూ ఒక సారి ఆర్డినెన్స్ బడ్జెట్ .. ఇది మంచిది కాదన్న యనమల

గతంలోనూ ఒక సారి ఆర్డినెన్స్ బడ్జెట్ .. ఇది మంచిది కాదన్న యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ తరహా వైఖరి ఉందని మండిపడిన యనమల రామకృష్ణుడు గతంలో ఓసారి సీఎం జగన్ మొక్కుబడిగా బడ్జెట్ పెట్టాలని చూస్తే , మూడు రాజధానుల బిల్లుతో శాసన మండలి వ్యతిరేకించింది అని పేర్కొన్న యనమల రామకృష్ణుడు జగన్ సర్కార్ అప్పుడు కూడా ఇదే విధంగా బడ్జెట్ విషయంలో ఆర్డినెన్సు తెచ్చి మమ అనిపించారు అని గుర్తు చేశారు. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు .

ఏపీలో బడ్జెట్ పెట్టకుండా బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకురావటం పలాయనవాదం

ఏపీలో బడ్జెట్ పెట్టకుండా బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకురావటం పలాయనవాదం

ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక పేరుతో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పేరుతో బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా, ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ను తీసుకురావడం పలాయనవాదం అని యనమల వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి కానీ ఇలా చెయ్యటం తప్పన్నారు . అటు పార్లమెంటులో సైతం ఈ తరహా విధానం కొనసాగలేదని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసిందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

English summary
Yanamala Ramakrishnudu demanded the state government to put in full budget meetings or the Vote on account budget. He appealed to Governor Bishwabhushan Harichandan not to approve the ordinance budget tabled by the YCP government. Yanamala , who was incensed that Jagan's decision was a complete escape, said that Jagan Reddy had exposed the evil tradition of approving the budget in the form of ordinances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X