ఏపీ ప్రభుత్వం కీలక నియామకం - గంటల్లోనే ప్రక్రియ పూర్తి..!?
ఏపీ ప్రభుత్వం కీలక నియామకానికి రంగం సిద్దం చేసింది. మంత్రివర్గం ఆమోదం లభించింది.
ఏపీ ప్రభుత్వం కీలక నియామకానికి రంగం సిద్దం చేసింది. అసెంబ్లీ సెక్రట్రీ జనరల్ గా పీపీకే రామాచార్యుల నియామకానికి నిర్ణయించింది. ఈ న్యాన్ కేడర్ పోస్టును సృష్టించేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభ..లోక్ సభ సెక్రటరీ జనరల్ గా పని చేస్తున్న...ఆ పదవిలో పని చేసి పదవీ విరమణ చేసిన వారిని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించాలని నిబంధన ఉంది. గతంలో రామాచార్యులు రాజ్యసభ సెక్రటరీగా పని చేసి..ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పదవిలో నియమించారు.
నియమాకం సమయంలో ఏడాది కాల పరిమితి గా నిర్ణయించారు. ఇప్పుడు ప్రత్యేకంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ ను సోమవారం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. కొద్ది నిమిషాల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..స్పీకర్..అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సంతకం పూర్తయింది. తాజాగా కేబినెట్ లోనూ ఈ నియమకానికి సంబంధించి ఆమోదం లభించింది. దీంతో..ఏపీ అసెంబ్లీ సెక్రట్రీ జనరల్ హోదా లో నియమానికి ప్రాసెస్ పూర్తి అయింది. మంగళవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఎక్సైజ్ చట్ట సవరణకు అంగీకారం తెలిపింది. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవస్థానాల పాలక మండళ్లలో నాయీ బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో, గీత రచయిత చంద్రబోస్ తో పాటుగా చిత్ర యూనిట్ కు ఏపీ మంత్రివర్గం అభినందనలు తెలిపింది. సీఎం జగన్ స్వయంగా ఈ ప్రస్తావన తెచ్చి ఆర్ఆర్ఆర్ టీంను అభినందించారు.












Click it and Unblock the Notifications