విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేబినెట్ రెడీ : బాలినేని అలక - సజ్జల బుజ్జగింపులు: ఖాయమైన వారి పేర్లు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

మరి కొద్ది గంటల్లో ఏపీ కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇప్పటికే 24 మంది మంత్రులు చేసిన రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. పది మంది తాజా మాజీ మంత్రులకు తిరిగి కేబినెట్ లో అవకాశం కల్పించారు. మరో 15 మంది కొత్త వారికి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అయితే, ఈ కసరత్తు దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. అయితే, జాబితా ప్రకటనకు ముందు ఇంకా మార్పులు - చేర్పుల దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్త మంత్రుల విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. ఖరారు చేసిన వారిలోనూ కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తుది జాబితా ఆ సాయంత్రం 7 గంటలకు అధికారికంగా గవర్నర్ కు జాబితాను పంపనున్నారు.

అలక బూనిన బాలినేని.. బుజ్జగింపులు

అలక బూనిన బాలినేని.. బుజ్జగింపులు


అయితే,సీఎం జగన్ కొత్త జాబితాను దాదాపు ఖరారు చేసారు. ఆ లిస్టులో బాలినేని పేరు లేదు. ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. బాలినేని తో పాటుగా సురేష్ సైతం కొనసాగుతున్నారు. కానీ, ఇప్పుడు విస్తరణలో భాగంగా ఇద్దరినీ తప్పించాలి..లేదా ఇద్దరినీ కొనసాగించాలని బాలినేని కోరుతూ వచ్చారు. కానీ, సురేష్ ఒకరి పేరు మాత్రమే తుది జాబితాలో ఉందని తెలియటంతో బాలినేని అలక బూనారు. దీంతో..సజ్జల ఆయన నివాసానికి వెళ్లారు. బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లలో అందరినీ కొనసాగిస్తూ..తనను మాత్రమే తప్పించటం పైన బాలినేని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతో..సీఎం దూతగా సజ్జల వెళ్లినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఖరారైన జాబితాలో...

ఇప్పటి వరకు ఖరారైన జాబితాలో...


ఇక, పాత మంత్రుల్లో బొత్సా..అప్పలరాజు..వేణు గోపాల క్రిష్ణ.. తానేటి వనిత.. ఆదిమూలపు సురేష్.. అంజాద్ బాషా.. కొడాలి నాని..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జయరాం..బుగ్గన పేర్లు ఖాయమయ్యాయి. కానీ, అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కొత్త వారి జాబితాలో ధర్మాన ప్రసాదరావు..గుడివాడ అమర్నాధ్.. దాడిశెట్టి రాజా.. దొరబాబు.. కారుమూరి నాగేశ్వర రావు..జోగి రమేష్..రక్షణ నిధి..విడదల రజనీ.. మేరుగ నాగార్జున..కాకాని గోవర్ధన్ రెడ్డి..పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి పదవుల నుంచి తప్పించిన వారి అలకలు.. బెర్తులు దొరకని వారి ఆగ్రహాలతో చివరి నిమిషంలో ఈ జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీని కారణంగానే..చివరి నిమిషం వరకు వేచి చూసి రాత్రికి గవర్నర్ కు జాబితా పంపాలని నిర్ణయించారు.

పదవులు రాని సీనియర్లకు హామీలు

పదవులు రాని సీనియర్లకు హామీలు


ఈ సారి మంత్రి పదవులు ఖాయమని భావించినా రోజా.. అంబటి రాంబాబు లాంటి వారికి అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. అదే విధంగా పార్ధసారధి కి ఛాన్స్ లేదని సమాచారం. పదవులు ఇవ్వలేక పోయిన సీనియర్లకు పార్టీ నుంచి పదవుల పైన హామీలు ఇస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా క్షత్రియ..వైశ్య సామాజిక వర్గాలకు ఈ సారి కేబినెట్ లో స్థానాలు ఉన్నాయా లేవా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. క్షత్రియ వర్గానికి కేబినెట్ లో అవకాశం లేదని చెబుతున్నా.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే ఖారారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..2019 కంటే ఈ సారి కేబినెట్ కూర్పు సీఎం జగన్ కే పరీక్షగా మారుతోంది. ఇక, తుది జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Pressure is mounting on CM Jagan while finalising the cabinet list and there were last minute changes done
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X