బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం - నవరత్నాలకే ప్రాధాన్యత : నియోజకవర్గాలకు 350 కోట్లు..!!
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న 2022-23 వార్షిక బడ్జెట్ కు ఏపీ మంత్రివర్గం ఆమోద మద్ర వేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతున్నారు. నవరత్నాలకే భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా సమాచారం. ఈ సారి కూడా జెండర్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. దాదాపుగా 2.60 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ ను శాసనసభలో యధావిధిగా ఆర్దిక మంత్రి బుగ్గన.. శాసన మండలిలో పుష్పశ్రీవాణి ప్రవేశ పెట్టనున్నారు.
అదే విధంగా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో మంత్రి కన్నబాబు.. మండలిలో అప్పలనాయుడు ప్రతిపాదిస్తారు. ఈ బడ్జెట్ లో సంక్షేమం - నవరత్నాలకే దాదాపుగా లక్ష కోట్లు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మౌళిక సదుపాయాల కల్పనకు దాదాపుగా పది వేల కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, వ్యవసాయం కోసం రూ 31 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మహిళలు..పిల్లల సంక్షేమం పై శ్రద్ద పెట్టిన ప్రభుత్వం.. పేదల ఇళ్ల కోసం రూ 4500 కోట్లు.. వైఎస్సార్ ఆసరా రూ 6400 కోట్లు..చేయూత రూ.4200 కోట్లు..అమ్మ ఒడి కోసం రూ. 6500 కోట్లు ..జగనన్న విద్యా దీవెన కు రూ 2400 కోట్లు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

Recommended Video
నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్‌లో చూపే అవకాశం ఉంది. నేరుగాలబ్ధిదారులకు ఇచ్చే ప్రయోజనాల రూపంలో సుమారు రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ దిశగా ముందుకెళ్లాలంటే ఎంత లేదన్నా ఈ బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇక రాజధాని అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రణాళిక ప్రకారం సౌకర్యాలు కల్పించాల్సిందేనని రైతులకు ప్లాట్లు అభివృద్ధిచేసి ఇవ్వాలని హైకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఎంతమేర నిధులు కేటాయిస్తారనేది బడ్జెట్‌లో చూడాల్సి ఉంది. ఇక, 2024 ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చేసే ఇతరత్రా ప్రతిపాదనలు..అమరావతి.. ఉద్యోగాల నిర్ణయం.. మూడు రాజధానుల పైన ఎటువంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications