ROJA కి ఈ సారీ మంత్రి పదవి లేనట్లేనా - సీనియర్ల మంత్రాంగం: అక్కడే కాదు -మా స్థానాలు మా వాళ్లకే..!!
ఏపీ అధికార పార్టీలో కేబినెట్ విస్తరణ రాజకీయం ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న మంత్రులను అందరినీ తప్పించటం ఖాయమని ..అంతా దాదాపుగా డిసైడ్ అయిపోయారు. కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం లోగా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా..అందరినీ తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్ లోని సీనియర్లను తప్పించి...వారి స్థానంలో పార్టీ కోసం పని చేసి మంత్రి పదవి దక్కని వారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల టీం ఎంపిక లో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాంతీయ -సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

పట్టు కోసం సీనియర్ల ప్రయత్నాలు
అయితే, ప్రస్తుత కేబినెట్ లో ఉన్న సీనియర్లను తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే, కేబినెట్ లో కొందరు సీనియర్లకు జగన్ తో ఉన్న సత్సంబంధాలు.. పార్టీలో క్రియాశీలకంగా మారటంతో వారు జగన్ మాటను గౌరవిస్తూనే..కొత్త మంత్రాంగానికి తెర తీస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా..తాము కేబినెట్ నుంచి తప్పుకొని సీఎం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తామని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలో మారుతున్న సమీకరణాలు
కానీ, మంత్రిగా తమను తప్పిస్తే జిల్లాలో తమకు ఉన్న పట్టు పోకుండా తాము సూచించిన వారికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలంటూ సీనియర్లు కొందరు ముఖ్యమంత్రి వద్ద తమ ప్రతిపాదనలు ఉంచేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రోజాకు కేబినెట్ లో స్థానం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ, చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వటంతో రోజాను పక్కన పెట్టారు. ఆ తరువాత నామినేటెడ్ పదవితో బుజ్జగించారు.

పెద్దిరెడ్డికి జిల్లాల్లో పెద్దపీట
అయితే, ఇప్పుడు ఉన్న మంత్రులను తప్పిస్తున్న సమయంలో..పెద్దిరెడ్డి సైతం మంత్రి పదవి కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో..పెద్దిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గం..మహిళగా రోజాకు స్థానం ఖాయమని ఆమె అనుచర వర్గం భావిస్తోంది. అయితే, పార్టీ ఏర్పాటు సమయం నుంచి 2019 ఎన్నికల దాకా పార్టీకి అన్ని రకాలుగా సహకారం అందించిన పెద్దిరెడ్డిక సీఎం ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక, పంచాయితీ..స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక, కుప్పం నియోజకవర్గంలో అన్ని ఎన్నికల్లోనూ టీడీపీని దెబ్బ తీయటంలో ప్రధాన భూమిక ఆయనదే.

రోజా పైన జగన్ కరుణ చూపుతారా
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని కాదని ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, పెద్దిరెడ్డి స్థానంలో ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి రోజాతో పాటుగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. భూమన కరుణాకర రెడ్డి పోటీలో ఉన్నారు. భూమన సీనియర్ గా ఉన్నారు. అయితే, పెద్దిరెడ్డిని ముఖ్యమంత్రి జగన్ విధాన పరమైన నిర్ణయంలో భాగంగా తప్పిస్తే...చిత్తూరు జిల్లా తంబాలపళ్లి ఎమ్మెల్యే...పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు అయిన పెద్దిరెడ్డి ద్వారకా నాద్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైనట్లుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది.

రోజా మంత్రి పదవి చుట్టూ రాజకీయం
అయితే, తిరిగి పెద్దిరెడ్డి కుటుంబానికే ఇవ్వటం వలన సమస్యలు వస్తాయని భావిస్తే రెండో ప్రత్యామ్నాయంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు ను ప్రతిపాదిస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..రోజాకు ఈ సారి మంత్రి పదవి అనేది డౌట్ గానే కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ ఈ సారైన రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే..అప్పుడు మాత్రమే రోజాకు కేబినెట్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. రోజా సైతం సొంత నియోజకవర్గంలోనే..సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు.

రోజా పట్టు కోల్పోతున్నారా..పెద్దిరెడ్డి జోక్యం
తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో నిండ్ర మండలంలో ఇబ్బంది పడిన రోజా..పెద్దిరెడ్డి జోక్యం కోరారు. అయితే, చిత్తూరు జిల్లాలోనే కాకుండా... ఉత్తరాంధ్ర లోని ఒక సీనియర్ మంత్రి... కోస్తా ప్రాంతంలోకి ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సైతం తమను తప్పించినా....తమ వారికి అవకాశం ఇస్తే..వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకుంటామని ప్రతిపాదించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే, జగన్ తొలి విడత కేబినెట్ కూర్పు లో ఎవరికీ అంతు చిక్కని సమీకరణాలతో మంత్రులను ఎంపిక చేసారు.

జగన్ కూర్పు పైన ఎవరి అంచనాల్లో వారు..
ఈ సారి అందరినీ తప్పించాలని డిసైడ్ అవ్వటంతో పాటుగా మంత్రులే తమంతటగా తాము ముందుకు వచ్చి జగన్ అదే నిర్ణయం అమలు చేస్తే...సహకరిస్తామని చెబుతున్నారు. దీంతో..ఎన్నికల కేబినెట్ కూర్పులో పార్టీ - ప్రభుత్వ పరంగా బలమైన వాయిస్ వినిపించే వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయం లో సీనియర్లు చేస్తున్న మంత్రాంగం ఆశావాహుల్లో ఉత్కంఠకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ సీనియర్లు అటువంటి ప్రతిపాదనలతో వచ్చినా పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉండదని కొందరు పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. మరి సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications