అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త కేబినెట్ లో బీసీ 10 - ఎస్సీ 6 మందికి : రెడ్డి- కాపు 4 చొప్పున : కమ్మ- వైశ్య- క్షత్రియకు నో ఛాన్స్..!!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ కేబినెట్ లో జగన్ బీసీలకు పెద్ద పీట వేసారు. ఏకంగా 10 మందికి బీసీలకు అవకాశం కల్పించారు. ఓసీ వర్గాల్లో రెడ్డి.. కాపు సామాజిక వర్గాలకు మినహా ఇతరులకు అవకాశం కల్పించలేదు. గత కేబినెట్ లో వైశ్య..క్షత్రియ..కమ్మ వర్గాలకు అవకాశం కల్పించినా..ఈ సారి ఆ వర్గాలకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక, ఎస్సీ వర్గానికి చెందిన అయిదుగురికి అవకాశం ఇచ్చారు. రెడ్డి-కాపు వర్గాలకు మాత్రం నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్టీ..మైనార్టీ వర్గాలకు ఒక్కో పదవి దక్కింది.

మంత్రులు - సామాజిక వర్గాలు

మంత్రులు - సామాజిక వర్గాలు

ఇక.. కొత్తగా ఖరారైన మంత్రులు.. వారి సామాజిక వర్గాలు పరిశీలిస్తే.. ధర్మాన ప్రసాదరావు - వెలమ (బీసీ), సీదిరి అప్పలరాజు- మత్స్యకార(బీసీ), బొత్స సత్యనారాయణ- తూర్పు కాపు(బీసీ), పీడిక రాజన్నదొర(ఎస్టీ), గుడివాడ అమర్నాథ్(కాపు), పూడి ముత్యాలనాయుడు- కొప్పుల వెలమ(బీసీ), దాడిశెట్టి రాజా(కాపు), చెన్నుబోయిన వేణు- (బీసీ), తానేటి వనిత- మాల(ఎస్సీ) ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు-యాదవ(బీసీ), బొట్టు సత్యనారాయణ(కాపు), జోగి రమేష్- గౌడ(బీసీ), అంబటి రాంబాబు(కాపు), మేరుగు నాగార్జున- మాల(ఎస్సీ), విడదల రజని-రజక(బీసీ) కి అవకాశం దక్కింది.

ఆ వర్గాలకు ఇలా ప్రాధాన్యత

ఆ వర్గాలకు ఇలా ప్రాధాన్యత


కాకాని గోవార్థన రెడ్డి(రెడ్డి) , అంజాద్ భాషా(ముస్లిం), బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి(రెడ్డి), గుమ్మనూరి జయరాం- బోయ(బీసీ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(రెడ్డి), నారాయణ స్వామి-(ఎస్సీ), ఆర్కే రోజా(రెడ్డి), ఉషశ్రీ చరణ్-కురుబ(బీసీ), తిప్పేస్వామి(ఎస్సీ), విశ్వరూప్(ఎస్సీ) ఉన్నారు. ఇక, వైశ్య -కమ్మ-క్షత్రియ వర్గాలకు ఇతర పోస్టులు ఖరారు చేసారు. డిప్యూటీ స్పీకర్ గా ఇప్పటి వరకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉండగా.. ఇప్పుడు వైశ్య వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామికి కేటాయించాలని నిర్ణయించారు.

ప్రకాశం కు దక్కని కేబినెట్

ప్రకాశం కు దక్కని కేబినెట్


క్షత్రియ వర్గానికి చెందిన ప్రసాద్ రాజు ని చీఫ్ విప్‌గా నియామకం చేసారు. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్ పర్సన్ గా కొడాలి నాని నియమితులు కానున్నారు. అయితే, ప్రకాశం జిల్లాకు ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక్కడ మంత్రులుగా ఉన్న ఆదిమూలపు సురేష్..బాలినేని ఇద్దరిలో సురేష్ ను కొనసాగిస్తారని ప్రచారం సాగింది. అయితే, బాలినేని అలకతో ఇద్దరినీ తప్పించి..అసలు జిల్లాకు మంత్రి పదవే ఇవ్వలేదు. చివరి నిమిషంలో మార్పులు చేస్తే మినహా..జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు.

English summary
AP cabinet final list is ready with 10 BCs, 6 SCs and 4 reddy kapu each
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X