Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయిదుగురు మంత్రుల కంటిన్యూ..!! సీనియర్లకు నో ఛాన్స్ : సీఎం జగన్ లెక్కల వెనుక..!!

ఇప్పుడు ఏపీలో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఉండేదెవరు... కొత్తగా వచ్చేదెవరు అనే ఈక్వేషన్ల పైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్న వారు జగన్ నిర్ణయాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం ప్రస్తుత మంత్రులకు చివరి మీటింగ్. రాజీనామా లేఖలతోనే మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ సమావేశం తరువాత ప్రస్తుత మంత్రులు మాజీలు కాబోతున్నారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అయితే, ఈ రోజు మంత్రులు అందరూ రాజీనామా చేసినా.. తిరిగి ప్రస్తుత మంత్రుల్లో కొందరు కొనసాగుతారనేది ఖాయంగా తెలుస్తోంది.

ఈ అయిదుగురికి మినహాయింపు

ఈ అయిదుగురికి మినహాయింపు

ఇదే విషయాన్ని గత కేబినెట్ భేటీలో సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగించాల్సి వస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలా కొనసాగే మంత్రులు ఎవరనే దాని పైన ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలోని ముఖ్యుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో తిరిగి అయిదుగురు మరలా మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగానే వీరిని కొనసాగించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందులో ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా గుమ్మనూరి జయరాం తిరిగి కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు - అనంతపురం జిల్లాల్లో బోయ సామాజిక వర్గానికి చెందిన వారిలో వైసీపీ నుంచి మరొకరు లేకపోవటంతో ఆయనకు తిరిగి కేబినెట్ లో స్థానం ఖాయమని తెలుస్తోంది. బోయ వర్గానికి ప్రాధాన్యత కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

సామాజిక లెక్కల్లో కలిసొచ్చింది

సామాజిక లెక్కల్లో కలిసొచ్చింది

అదే విధంగా.. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు సైతం ప్రచారంలో ఉన్నా.. ఇతర సీనియర్లను పక్కన పెడుతున్న సమయంలో పెద్దిరెడ్డిని కొనసాగిస్తే.. ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం ఉంది. దీంతో..పెద్దిరెడ్డి కొనసాగింపుకు ఛాన్స్ లేదనే తెలుస్తోంది. ఇక, తూర్పు గోదావరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న చెల్లబోయిన వేణు గోపాల క్రిష్ణ సైతం కొనసాగనున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ వర్గానికి ప్రాధాన్యత కొనసాగించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు ఎంపిక చేసారు. అయితే, ఇప్పుడు కేబినెట్ లోనూ ఈ వర్గానికి చెందిన వేణును కంటిన్యూ చేయాలని నిర్ణయించారని సమాచారం. అదే విధంగా మత్స్యకార వర్గానికి చెందిన శ్రీకాకుళం నుంచి మంత్రిగా ఉన్న సిదిరి అప్పలరాజు సైతం కంటిన్యూ అవుతారని సమాచారం.

సీనియర్లు అయినా.. పార్టీ బాధ్యతలకే

సీనియర్లు అయినా.. పార్టీ బాధ్యతలకే


ఆయన స్థానంలో ఒక దశలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే సతీష్ పేరు రేసులోకి వచ్చినా... జిల్లా సమీకరణాల్లో భాగంగా అక్కడ ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండటంతో అప్పలరాజు కొనసాగింపు తప్పేలా లేదని తెలుస్తోంది. ఇక, ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ సైతం కొనసాగే మంత్రుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న బాలినేనిని తప్పించి సురేష్ ను కొనసాగిస్తే జిల్లాలో పార్టీలో ప్రతికూల ప్రభావం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ, సామాజిక సమతుల్యతలో భాగంగా సురేష్ కొనసాగింపు ఉంటుందని చెబుతున్నారు. ఇక, క్షత్రియ వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాధ రాజు పేరు సైతం కొనసాగే మంత్రుల జాబితాలో చివరి నిమిషంలో చేరిందని విశ్వసనీయ సమాచారం. అక్కడ రంగనాధ రాజు స్థానంలో ప్రసాద రాజుకు అవకాశం దక్కుతుందని ఇప్పటి వరకు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది.

Recommended Video

    AP Cabinet Expansion: కొత్త మంత్రులతో కేబినెట్ కూర్పు AP CM Jagan క్లారిటీ | Oneindia Telugu
    సీఎం జగన్ నిర్ణయాలతో.. సీనియర్లు సహకరిస్తారా

    సీఎం జగన్ నిర్ణయాలతో.. సీనియర్లు సహకరిస్తారా


    కానీ, అనూహ్యంగా రంగనాధ రాజు కొనసాగింపు దిశగా సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. క్షత్రియ వర్గంలో గుర్తింపు.. పశ్చిమ గోదావరి లో ఆ వర్గంలో బలమైన సంబంధాలు పరిగణలోకి తీసుకున్నారని చెబుతున్నారు. రఘురామ రాజు కారణంగా ఆ వర్గంలో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో..ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. అయిదుగురి మంత్రులను కొనసాగించటం ద్వారా పదవులు కోల్పోతున్న సీనియర్లలో అసంతృప్తి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. నేటి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా వీరి కొనసాగింపుకు గల కారణాలను వివరించి.. అసంతృప్తి కి అవకాశం లేకుండా ప్రయత్నాలు చేయనున్నారు. అయితే, సీఎం జగన్ తుది జాబితాలో ఎటువంటి మార్పులు చేర్పులు చివరి నిమిషంలో చోటు చేసుకున్నా...ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+