ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-విజయవాడ, వైజాగ్ మెట్రో టెండర్లు, భారీ పెట్టుబడులు..!

ఏపీలో ఇవాళ సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టులకు రేపు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో తాజాగా జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్ధలకు భూముల కేటాయింపులు, ఎలక్ట్రానిక్స్ తయారీ విధానానికి ఆమోదం వంటివి ఉన్నాయి.

ఇవాళ రాష్ట మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలో 79వేల 900 కోట్ల పెట్టుబడుల రాకకు మంత్రివర్గం ఆమోదించింది. పెట్టుబడుల ద్వారా 1.25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
ఎలక్ట్రానికి ఇండస్ట్రీని అభివృద్దే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ తయారీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లాలో ఐటీ ఇన్ ఫ్రా కోసం పేరొందిన సంస్థలకు భూములు, ప్రోత్సాహకాల్ని మంత్రివర్గం ఆమోదించింది.

ap cabinet key decisions including nod to Vijayawada vizag metro rail tenders sipb resolutions

విశాఖలోనే సిఫి ,గుగూల్ సంస్థల డేటా సెంటర్లు ఏర్పాటుకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ పట్నాన్ని సాఫ్ట్ వేర్, డేటా , ఐటీ సెక్టార్ల లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్ధసారధి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో లే అవుట్లు వేసి పలు సమస్యలతో ఇళ్లు నిర్మించలేని పరిస్ధితి ఉండటంతో, సమస్య పరిష్కారానికి భూముల క్రమబద్ధీకరణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

విశాఖపట్నం , విజయనగరం, అనకాపల్లి జిల్లాలో 1941 ఎకరాలను భూ సేకరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
అలాగే సీఆర్డీఏలో ల్యాండ్ పూలింగ్ చేయని 24 గ్రామాల్లో రోడ్లు , నిర్మాణాల కోసం అవసరమైన భూ సేకరణ చేసి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అదాని పవర్ కు సంబంధించి ఒడిస్సా సరిహద్దుల్లో 1200 , 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు రద్దుకు మంత్రి మండలి ఆమోదించింది.

20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. రైతుకు 20 క్వింటాళ్ల చొప్పున పరిమితి గా నిర్ణయించి కొనుగోళ్లు జరపాలని నిర్ణయించామన్నారు. అవసరమైతే రాష్ట్రంలో మరిన్ని పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచాలని నిర్ణయించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పై జస్టిస్ సత్యనారాయణ ఇచ్చిన నివేదిక పై కేబినెట్ చర్చించింది. నివేదికలో తెలిపిన అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

ap cabinet key decisions including nod to Vijayawada vizag metro rail tenders sipb resolutions

మరోవైపు గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దారుణంగా దెబ్బతిందని, దెబ్బతిన్న ఆంధ్ర బ్రాండ్ ను రీ బిల్ట్ చేయడమే లక్ష్యంగా సీఎం సింగపూర్ పర్యటన చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రతిష్టాత్మక సంస్థలు సింగపూర్ నుంచి పనిచేస్తున్నాయని, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలను కలసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యాంగా సీఎం పర్యటన చేస్తారన్నారు. అమరావతిలో అభివృద్ది పనులకు టెండర్లు పూర్తై పనులు వేగంగా జరుగుతున్నాయని, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు అమరావతి అభివృద్ధితో సంబంధం లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+