ఏపీ ఉద్యోగులకు నూతన పీఆర్సీ - సీపీఎస్ పై కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘ కాలంగా జరగుతున్న సీపీఎస్ రద్దు అంశం పైన నిర్ణయం ప్రకటనకు రంగం సిద్దమైంది. అదే విధంగా 12వ వేతన సంఘం నియామకానికి సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇప్పటికే నిర్ణయించిన విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.

12వ పీఆర్సీ ఏర్పాటు దిశగా:ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల అంశాలపై నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కొత్త పీఆర్సీ నియామకం పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

AP Cabinet likely to announce decision on CPS, Chances to Appoint 12th Pay Revision Commission

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఆర్దిక శాఖకు నూతన పీఆర్సీ నియామకానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త వేతన సంఘం ఏర్పాటుకు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. ఎన్నికల సమయంలోగా నివేదిక రాక ఆలస్యం అయితే.. ఐఆర్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కొత్త పీఆర్సీ ఛైర్మన్ పైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ:ఇక ఇదే సమావేశంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు (రెగ్యులరైజ్) కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రెండు రోజుల క్రితం జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు పైనా చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచి విడతల వారీగా పెండింగ్ బిల్లుల చెల్లింపు పైన ప్రతిపాదన..నిర్ణయం జరిగాయి. ఈ రోజు ఆర్దిక శాఖ అధికారులు ఉద్యోగుల అంశాలకు సంబంధించి కేబినెట్ లో వివరించనున్నారు. ఆ తరువాత చర్చించి.. ప్రభుత్వ పరంగా నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇదే సమయంలో సీపీఎస్ వ్యవహారం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

సీపీఎస్ పై నిర్ణయం:సీపీఎస్ పైన ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర రెడ్డి చెప్పారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీని పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీని పైన మంచి నిర్ణయం ఉంటుందన్నారు.

పాత ఫించను పథకానికి సమానండే పథకాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనుకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేస్తున్నారని వివరించారు. అయితే, పీఆర్సీ వర్తించదని చెప్పుకొచ్చారు. కొత్త పథకాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానిస్తాయనే ఆశాభావం చంద్రశేఖర రెడ్డి వ్యక్తం చేసారు. దీంతో, మంత్రివర్గ సమావేశంలో సీపీఎస్ పైన తీసుకొనే నిర్ణయం పైన ఉద్యోగుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+