ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, మంత్రులకు కాస్ట్ కటింగ్- ఏపీ కేబినెట్ నిర్ణయాలు..!!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ చేసిన సూచనల పైన మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. నాదేశం - నా బాధ్యత పేరుతో పొడుపు పై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచన చేసారు. ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముందుగా వారానికి రెండు రోజులు అమలు చేయనుంది. మంత్రులకు జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ కు నిర్ణయించారు.

ఏపీ కేబినెట్ లో పొదుపు చర్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేయాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. వారానికి ఒకరోజు నో వెహికల్ డే అమలు చేయనున్నారు. వెహికల్ కాకుండా ప్రత్యామ్నాయ రవాణా పై దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కానీ ఈవీ వెహికల్, సైకిల్ ను వినిగిగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని సీఎం నిర్దేశించారు. మెజారిటీ మీటింగ్స్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్దేశించారు. ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు మార్గదర్శకాల పైన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ ను 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ లో ఖర్చులు తగ్గించాలని నిర్ణయించారు. సోలార్ ఎనర్జీ నే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా మంత్రులనుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ లో నిర్దేశించారు. అదే విధంగా ఒక్కో ఐఏఎస్ అధికారి ఎన్ని కార్లు వినియోగిస్తున్నారో లెక్క చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
ap-cabinet-made-key-discussions-over-conserve-resources-and-increase-self-reliance-covering-fuel-co

పొదుపు చర్యల పై ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు

వివిధ విభాగాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ, నాలుగైదు కార్లు వినియోగిస్తున్న కొందరు అధికారుల గురించి చర్చ జరిగింది. సీఎంఓ తో సహా పలువురు అధికారుల్లో కొందరు రెండు, మూడు కార్లు వినియోగిస్తున్న పరిస్థితి పైనా చర్చ జరిగింది. ఇకపై ఒక అధికారికి ఒక అధికారిక వాహనమే ఉండాలన్న ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అందరం కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని అన్నారు. ఇంకా ఇతర పొదుపు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాడే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు.పొదుపు చర్యలని మనం ఒకేసారి ప్రజలకు చెబితే ఇబ్బంది పడతారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిదానంగా వెళ్దామని పవన్ కల్యాణ్ సూచించారు. రెండు రోజుల పాటు మనం ప్రజలకు అన్ని పొదుపు చర్యలు వివరిద్దామని సీఎం అన్నారు. అలానే చేద్దామని మిగతా మంత్రులు చెప్పారు. వర్క్ ఫ్రం హోం, కార్ పూలింగ్ పాటించాలని సీఎం సూచించారు. ఆయా శాఖల్లో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కార్యదర్శులు నివేదిక ఇవ్వాలని కోరారు. ఒక కేబినెట్ సబ్‌కమిటీని నియమిస్తే బాగుంటుందని వివరించారు. ముందుగా ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెబుదామని మంత్రులు ప్రస్తావించారు. ప్రజలకు అవగాహన కలిగించిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుందామని డిప్యూటీ సీఎం చెప్పారు. అందుకు సీఎం అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+